లంచ్ కు వెళ్లిన మహేష్ ఫ్యామిలీ.. నమ్రత ఏం చెప్పిందంటే?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు బిజీగా ఉంటారో.ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పలేం.

 Namrata Shirodkar Shares Sitara And Mahesh Babu Adorable Moments-TeluguStop.com

అలాంటిది కరోనా వల్ల వారికి ఎక్కడలేని తీరిక దొరికింది.ఎప్పుడూ లేనంతగా వారు తమ ఫ్యామిలీస్‌తో గడిపే సమయం దొరకడం చాలా మంది సంతోషంగా చెప్పుకున్నారు.

కానీ కొంత మంది చిన్న ఆర్టిస్టులకు మాత్రం తీవ్ర సంక్షోభం ఏర్పడి, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

 Namrata Shirodkar Shares Sitara And Mahesh Babu Adorable Moments-లంచ్ కు వెళ్లిన మహేష్ ఫ్యామిలీ.. నమ్రత ఏం చెప్పిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే అగ్ర తారలు కూడా ఇప్పుడిప్పుడే బయటికొచ్చి సినిమా షూటింగ్‌లతో బిజీగా మారుతున్నారు.

అందులో ఒకరు మహేశ్ బాబు.ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట అనే సినిమా షూటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఆయన గురించి చెప్పుకోవాలంటే ఏ మాత్రం సమయం దొరికినా తన ఫ్యామితో గడపడానికే ఇష్టపడతాడని చాలా సందర్భాల్లోనూ ఆయనే చెప్పారు.షూటింగ్ కోసం అవుట్ డోర్‌కు వెళ్లినా కూడా తన వెంట వారిని తీసుకెళ్తుంటాడు.

అలా సర్కారు వారి పాట షూటింగ్ కోసం గత ఏడాది దుబాయ్‌కి, తాజాగా గోవాకు కూడా తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు.అలా ఎప్పుడూ మహేష్ బాబు తన కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు.

ఇక తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీని లంచ్ పార్టీకి తీసుకెళ్లినట్టు కనిపిస్తోంది.అయితే ఇందులో ఆయన సర్కారు వారి పాట లుక్కులోనే కనిపిస్తున్నారు.

అంటే సెట్ నుంచి నేరుగా బయటకు వచ్చారని తెలుస్తోంది.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే నమ్రత తన పిల్లల గురించి నిత్యం అభిమానులకు తెలియజేస్తుంటారు.తాజాగా సితార, మహేష్ బాబు లంచ్ పార్టీలో చేసిన సందడి గురించి నమ్రత వివరిస్తూ.సితారకు తన తండ్రి మహేష్ బాబుతో లంచ్ చేయడం అంటే ఎప్పుడూ సరదాగానే ఉంటుందని చెప్పుకొచ్చారు.

అదే విధంగా తన సితార కోసం మహేష్ ఎప్పుడూ ఏదో ఒక సర్ ప్రైజ్ ఇస్తాడని ఆమె తెలిపారు.మొత్తానికి సితార మాత్రం తండ్రి చాటు బిడ్డని ఈ సందర్భంగా నమ్రత తెలియజేశారు.

ఇకపోతే, మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్‌తో పాటుగా.నవంబర్‌లో త్రివిక్రమ్ మూవీని ప్రారంభించబోతున్నట్టు సమాచారం.

https://www.instagram.com/reel/CUHrIi7p0Aa/?utm_source=ig_web_copy_link
#MaheshBabu #Mahesh Babu #MaheshBabu #Adorable #Lunch

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు