పిల్లల గురించి సీక్రెట్స్ రివీల్ చేసిన నమ్రత మహేష్

పిల్లల పెంపకంలో తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందుకే పిల్లలకి తల్లే మొదటి గురువు అని అందరూ అంటూ ఉంటారు.

 Namrata Open Up About Her Kids-TeluguStop.com

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎక్కడైనా తల్లి పెంపకం, ఆమె తీసుకునే కేరింగ్ బట్టి పిల్లలు భవిష్యత్తులో ఎలా తయారవుతారు అనేది డిసైడ్ అవుతుంది.పిల్లల కేరింగ్ విషయంలో సెలబ్రిటీలలో సూపర్ స్టార్ మహేష్ సతీమణి ఒకప్పటి హీరోయిన్ నమ్రత ముందు వరుసలో ఉంటూ బెస్ట్ మదర్ అనిపించుకుంటారు.

మహేష్ బాబు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండటం వలన పిల్లలతో స్పెండ్ చేసే టైమ్ తక్కువ దొరుకుతుంది.అయితే వాళ్ళ కంప్లీట్ బాద్యతని నమ్రత తీసుకుంది.

 Namrata Open Up About Her Kids-పిల్లల గురించి సీక్రెట్స్ రివీల్ చేసిన నమ్రత మహేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బెస్ట్ వైఫ్ అనిపించుకోవడంతో పాటు బెస్ట్ మదర్ కూడా అనిపించుకుంటూ వారి విషయంలో అన్ని బాద్యతలు నిర్వహిస్తుంది.

ఇదిలా ఉంటే తాజా మదర్స్ డే సందర్భంగా తన పిల్లలు గౌతమ్, సితార గురించి ఆసక్తికర విషయాలని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

పిల్లల కోసం పూర్తి సమయం కేటాయిస్తానని, వారి ఇష్టాయిష్టాలను గౌరవిస్తూనే మంచీ చెడు చెబుతుంటానని నమ్రత చెప్పింది.వీలైనంత నిరాడంబరంగా ఉండమని చెబుతూ మంచికి, చెడుకి తేడా చెబుతుంటా అని చెప్పుకొచ్చింది.

ఏ పిల్లలూ అదే పనిగా చదువుకోవడానికి ఇష్టపడరని, అందుకే వాళ్లను చదివించేటప్పుడు మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటానని ఆమె తెలిపింది.అంతేకాకుండా ఆటలు కూడా వారి జీవితంలో ఒక భాగమని.

తన కొడుకు గౌతమ్ స్విమ్మింగ్ ఇష్టపడతాడని, తన కూతురు సితారకు డాన్స్ అంటే ఇష్టమని తెలిపింది.

#Goutham #Star Kids #Sitara #SuperStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు