ఆచార్య నుండి మహేష్‌ను ఔట్ చేసింది ఆమెనా?  

Namrata Behind Mahesh Exit From Acharya - Telugu Acharya, Mahesh Babu, Namrata, Telugu Movie News

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు మంచి హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మహేష్ సంక్రాంతి సీజన్‌లో మరో హిట్ కొట్టి తన సత్తా చాటాడు.

 Namrata Behind Mahesh Exit From Acharya

కాగా ఈ సినిమా తరువాత మహేష్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య అనే సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

దీనికి సంబంధించి మహేష్ కూడా పాజిటివ్‌గా స్పందించడంతో మెగాస్టా్ర్, సూపర్‌స్టార్‌లను కలిసి చూడాలని చాలా మంది ఆశగా ఎదురుచూశారు.

ఆచార్య నుండి మహేష్‌ను ఔట్ చేసింది ఆమెనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే కొన్ని కారణాల వల్ల మహేష్ ఆచార్య నుండి తప్పుకున్నట్లు వార్తలు రావడంతో అందరూ నిరాశకు లోనయ్యారు.కాగా ఈ సినిమా నుండి మహేష్ వైదొలగడానికి అసలు కారణం అతడి భార్య నమ్రత అని తెలుస్తోంది.

మహేష్‌కు సంబంధించిన రెమ్యునరేషన్ విషయాలను చూసుకునే నమ్రత, ఆచార్య టీమ్‌ మధ్య పేమెంట్ విషయంలో మనస్పర్థలు రావడంతో మహేష్‌ ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మొత్తానికి మహేష్ సినిమాలను ఓకే చేసి, వాటిని ప్రారంభించే నమ్రత వల్ల మెగాస్టార్‌, సూపర్ స్టార్ కాంబో మిస్ అయ్యిందని ఇద్దరు హీరోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Namrata Behind Mahesh Exit From Acharya Related Telugu News,Photos/Pics,Images..

footer-test