పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిన నమ్రత.. ఫోటోలు వైరల్!

మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవన్ అని ఎవ‌ర‌న్నారో కానీ ప్రిన్స్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ జంట‌ని చూస్తుంటే అది నిజ‌మేన‌ని అనిపిస్తుంది.నా అసలైన ప్రేమకు అర్థం నువ్వే అంటూ మహేశ్ భార్య నమ్రత పై కురిపించే ప్రేమ జ‌ల‌స్ గానే ఉంటుంది.మ‌హ‌రాష్ట్ర సినీ నేపధ్యం ఉన్న కుటుంబానికి చెందిన నమ్ర‌తా శిరోద్క‌ర్ మోడ‌ల్ గా కెరియ‌ర్ ను ప్రారంభించారు.1993లో మిస్ ఇండియా కిరీటాన్ని ద‌క్కించున్నారు.మిస్ యూనివ‌ర్స్ విభాగంలో ఆరోప్లేస్ లో నిలిచారు.మిస్ట్ ఏసియా ప‌సిపిక్ కాంటెస్ట్ లో తొలి ర‌న్న‌ర్ గా గెలుపొందారు.

 Namrata Sirodhkar, Mahesh Babu, Tollywood Industry, Marriage Photos, Throwback P-TeluguStop.com

మోడ‌ల్ కంటే ముందు 1977లో షిరిడి సాయిబాబా అనే హిందీ ఫిల్మింలో చైల్డ్ ఆర్టిస్ట్ గా, మ‌నోజ్ కుమార్, సునీల్ శెట్టి హీరోలుగా పురబ్ కి లైలా పచిమ్ కి చైలా అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది న‌మ్ర‌త.కానీ ఆ సినిమా విడుద‌ల కాలేదు.హ‌లో ఇండియా పేరుతో విడుద‌ల చేసినా బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచింది.1999లో యాక్ష‌న్ క్రైమ్ ఫిల్మిం వాస్త‌వ్ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న‌ న‌మ్ర‌త యాక్ట్ చేసింది.ఈ సినిమాతో స్టార్ డ‌మ్ సంపాదించింది.యాక్ష‌న్ క్రైమ్ ఫిల్మిం వాస్త‌వ్ సినిమా ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ గా నిలుస్తుంది.

2000 సంవత్స‌రం బీ గోపాల్ డైర‌క్ట‌ర్ గా మ‌హేష్ – న‌మ్ర‌త‌లు హీరో, హీరోయిన్ లు గా వంశీ సినిమా విడుద‌లైంది.ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో న‌మ్ర‌త‌పై.

మ‌హేష్ క్ర‌ష్ మొద‌లైంది.అప్ప‌టి నుంచి ఇద్ద‌రు డేటింగ్ ప్రారంభించి 2005 త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్ లో తెర‌కెక్కిన అత‌డు సినిమా స‌మ‌యంలో ముంబై మారియ‌ట్ హోట‌ల్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

పెళ్లి త‌రువాత వెండితెర‌కు దూర‌మైన న‌మ్ర‌తా త‌న పిల్ల‌లు గౌత‌మ్, సితార‌ల‌తో లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.మ‌హేష్ అత‌డు సినిమాతో స్టార్ డ‌మ్ సంపాదించారు.

నాటి నుంచి నేటి వ‌ర‌కు ఎవ‌ర్ గ్రీన్ హీరోగా, వెండి తెర రాకుమారుడిగా బాక్సాఫీస్ ను త‌న రికార్డ్ క‌లెక్ష‌న్ల‌తో అబ్బుర ప‌రుస్తున్నారు.

ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉండ‌గా లాక్ డౌన్ స‌మ‌యంలో భార్య న‌మ్ర‌త‌, పిల్ల‌లు సితారా, గౌత‌మ్ ల‌తో ఎంజాయ్ చేశారు.

గేమ్స్, సాంగ్స్ తో అభిమానుల్ని అల‌రించారు.తాజాగా న‌మ్ర‌త త‌న పెళ్లి సంద‌ర్భంగా దిగిన ఫోటోలను అభిమానుల‌తో పంచుకున్నారు.అప్పుడు అలా – ఇప్పుడు ఇలా అంటూ త‌న పెళ్లిఫోటో, త‌న త‌ల్లిదండ్రుల పెళ్లి ఫోటోల్ని విడుద‌ల చేసి పాత జ్ఞాప‌కాల్ని నెమ‌రు వేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube