అత్యాచారం కేసులో సెషన్ కోర్టు తీర్పు.. నిందితుడికి !

మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిని మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు తీర్పును వెలువరిచింది.నిందితుడిని పదేళ్ల పాటు జైలు శిక్షతో పాటు జరిమానాను న్యాయస్థానం విధించింది.

 Nampally Special Sessions Court , Nampally Special Sessions Court Verdict On Rap-TeluguStop.com

నాంపల్లిలోని 11వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్ కోర్టులో ఎనిమిదేళ్ల పాటు కేసు విచారణలో ఉండగా తాజాగా కోర్టు తీర్పు వెల్లడించింది.పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.నారాయణ ఆధ్వర్యంలో వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి శిక్షను విధించారు.

న్యూ బోయిన్ పల్లికి చెందిన గట్టు హనుమంత్ రావు కుమారుడు రాజేందర్ అలియాస్ వాస్తు రాజు (47) సివిల్ కాంట్రాక్టర్.

కాగా స్థానికంగా నివసించే ఓ మహిళపై 2012లో అత్యాచారం చేశాడు.దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకుని రిమాండ్ కు తరలించారు.సెషన్ కోర్టులో ఎనిమిదేళ్లుగా ఈ కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది.

కాగా దీనిపై నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు తీర్పు వెలువరించింది.నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించాలని ఆదేశించింది.జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష పెరుగుతుందని వెల్లడించారు.విచారణ అనంతరం పోలీసులు నిందితుడికి జైలుకు తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube