అర్దరాత్రి ఆ ఇంట్లో గడుపుతున్న నమిత.. అక్కడ ఏం చేస్తుందంటూ ఆరా.. చివరికి?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల రహస్యాల గురించి, వారి వ్యక్తిగతం గురించి తెలుసుకోవాలని చాలా ఆరాటపడుతుంటారు జనాలు.వారి గురించి ఏదైనా పుకార్లు లాంటివి వస్తే చాలు వెంటనే వాటిని వైరల్ గా మారుస్తుంటారు.

 Namitha Spends The Night In That House What She Is Doing There On That Timedo You Know What Happen At The End-TeluguStop.com

అలా ఇప్పటికి ఎంతో మంది సినీ సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చాయి.ఇక వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే చాలు అక్కడ ఎందుకు ఉన్నారు.

వారికి అక్కడ ఏం పని ఉంది అని వాటిని కూడా బాగా హైలెట్ చేస్తూ ఉంటారు.ఇదిలా ఉంటే నటి నమిత గురించి కూడా ఓ విషయాన్ని వైరల్ గా మార్చారు.

 Namitha Spends The Night In That House What She Is Doing There On That Timedo You Know What Happen At The End-అర్దరాత్రి ఆ ఇంట్లో గడుపుతున్న నమిత.. అక్కడ ఏం చేస్తుందంటూ ఆరా.. చివరికి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి గుజరాతి బ్యూటీ నమిత తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న నటి.తన అందానికి కాస్త గ్లామర్ ను పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా గ్లామర్ బ్యూటీ గా నిలిచి.మిస్ ఇండియా గా నాల్గవ స్థానంలో గుర్తింపు తెచ్చుకుంది.ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా నటించింది.

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన జెమిని సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమాలో తన అందంతో, నటనతో బాగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత సొంతం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలా పలు సినిమాలలో నటించగా ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో మాత్రం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

బిల్లా సినిమాలో ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఏకంగా గ్లామర్ షో లతో, ఎద అందాలతో అందర్నీ నోటిమీద వేసేలా చేసింది.ఇక బాలకృష్ణ నటించిన సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.ఒకప్పుడు సన్నగా, నాజూగ్గా ఉండే నమిత ఇప్పుడు బాగా బరువెక్కింది.దీంతో ఆమెకు సినిమాలలో కూడా అవకాశాలు రాలేక పోతున్నాయి.

ఇక పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీనే దూరం పెట్టింది.ఇక బరువు తగ్గించుకోడానికి తెగ ప్రయత్నించింది.ఇక ఈమె గతంలో కొన్ని రూమర్లు ఎదుర్కొంది.కానీ అసలు విషయం తెలిసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.ఈమె అర్ధరాత్రి సమయాలలో సిటీ అవుట్ కట్స్ లో ఓ ఇంట్లో దాదాపు 4,5 గంటల వరకు గడుపుతుందని ఇండస్ట్రీలో బాగా గుసగుసలు వినిపించాయి.

దీంతో ఆమె అక్కడ ఏం చేస్తుందని అసలు ఆ ఇంట్లో తనకు పని ఏముంది అని ఆరా తీయడంతో ఆమె సల్సా డాన్స్ నేర్చుకోవడం కోసం, బరువు తగ్గించుకోవడం కోసం వెళ్లిందని తెలిసింది.దీంతో ఈ విషయం తెలుసుకున్నాక అందరు తెగ నవ్వుకున్నారు.ఇక ఈమె చివరిగా 2016లో మన్యంపులి సినిమాలో నటించగా ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం కష్టపడుతుంది అని తెలుస్తుంది.

ఇక ఈమె బాగా లావుగా ఉండటం తో బాగా వర్క్ అవుట్ లు చేస్తుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, తన భర్త తో దిగిన ఫోటోలను, అతనితో గడిపిన కొన్ని క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.

గతంలో పలు బుల్లితెర షో లలో కూడా ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం అభిమానులతో మాత్రం సోషల్ మీడియా వేదికగా టచ్ లో ఉంటుంది.

#Namitha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు