మీ పేరు D అక్షరంతో మొదలు అవుతుందా? మీ జీవితంలో జరిగే ఆసక్తికరమైన విషయాలు  

ఎవరి పేరు అయితే మొదటి అక్షరం D తో మొదలు అవుతుందో వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. D అక్షరంతో పేరు మొదలు అయ్యేవారిలో శక్తి సామర్ధ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు సంఘంలో పేరు ప్రఖ్యాతులు,గౌరవం కోసం చాలా కష్టపడతారు. వీరు బందువులకు ప్రాముఖ్యతను ఇస్తారు.

-


వీరు అందరూ కలిసి ఉండాలనే భావన కలిగి ఉంటారు. అంతేకాక స్నేహానికి కూడా ఎక్కువ విలువ ఇస్తారు. వీరికి విహార యాత్రలకు వెళ్ళటానికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. దైవ కార్యాలలో కూడా తరచుగా పాల్గొంటారు. స్నేహితులతో ఆనందంగా గడపటానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వటమే కాకుండా వారితో ఎంజాయ్ చేయాలనీ భావిస్తారు.

కుటుంబం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు. కుటుంబంలో ఏవైనా ఇబ్బందులు వస్తే వాటిని దైర్యంగా అధికమిస్తారు. వీరిలో 80 శాతం మంది చదువులో రాణిస్తారు. మిగతా 20 శాతం మంది సందేహం,భయంతో ముందడుగు వేయలేరు. ఆలా కాకుండా సందేహం,భయాలను వదిలేస్తే చదువులో బాగా రాణిస్తారు.

వీరు భాగస్వామిని అమితంగా ప్రేమించటమే కాకుండా ఆమె మాటలకు చాలా విలువ ఇస్తారు. అలాగే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామి సలహా తీసుకుంటారు. వీరు తల్లితండ్రులను ఎటువంటి కష్టం లేకుండా చూసుకోవాలనే తాపత్రయంలో ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు.

వీరు ఎదుటివారి ప్రవర్తనను పసిగట్టి వారితో ఎలా ఉండాలో అలానే ఉండటంలో సిద్దహస్తులు. వీరు బాధలో ఉన్నప్పుడు ఒంటరితనాన్ని కోరుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా దైర్యంగా నిలబడతారు. వీరు ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ఏవైనా అవాంతరాలు వస్తే వాటిని అధికమించి విజయాలను సాధిస్తారు.

వీరు కాస్త ఖర్చు ఎక్కువగా పెట్టిన దానికి తగ్గట్టుగా సంపాదిస్తారు. వీరు వారి శక్తిని నమ్మి ముందుకు సాగటం వలన అనుకున్న విజయాలను సాధిస్తారు. వీరు ఎక్కువగా కుటుంబానికి డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు.