మీ అదృష్ట సంఖ్య ఒకటా ? అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

సంఖ్యా శాస్త్రం ప్రకారం తొమ్మిది సంఖ్యలు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి.ఒక్కో సంఖ్యకు లక్షణాలు,విశిష్టత మరియు ప్రత్యేకతలు వేర్వేరుగా ఉంటాయి.

 Name Numerology Number 1 Meaning-TeluguStop.com

ఇప్పుడు అదృష్ట సంఖ్య 1 ఉన్నవారి అదృష్టం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.అసలు మీ అదృష్ట సంఖ్య ఏమిటో తెలియదా? అయితే ఈ వీడియో కచ్చితంగా మీ కోసమే.ఒక వ్యక్తి ఏ నెలలో అయినా సరే 1,10,19,28 తారీఖులలో జన్మిస్తే వారి అదృష్ట సంఖ్య 1 అవుతుంది.ఇప్పుడు 1 వ నెంబర్ అదృష్ట సంఖ్య కలిగిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

నెంబర్ 1 అదృష్ట సంఖ్య కలిగిన వారు కొత్త కొత్త ఆలోచనలతో బలమైన నిబద్దతను కలిగి ఉంటారు.అలాగే వీరు ఒకరి ఆజ్ఞలను పాటించటానికి ఇష్టపడరు.

వీరు ఎప్పుడు కొత్తగా ఎదో చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు.కాబట్టి ఇలాంటి వ్యక్తులు సి.ఈ.ఓ, డైరెక్టర్, మేనేజర్ స్థాయిలలో ఉంటారు.


ఈ అదృష్ట సంఖ్య కలిగిన వారిపై సూర్యుని ప్రభావము ఎక్కువ ఉంటుంది.సూర్యుణ్ణి సుజనాత్మక శక్తికి ప్రతిరూపంగా చెప్పుతారు.అందువల్ల అధికారం మరియు శక్తిని వీరు చేసే ప్రతి పనిలోనూ చూపిస్తూ ఉంటారు.

ప్రతి ఒక్క విషయాన్నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.

వీరు కోపాన్ని అణుచుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడరు.ఏ పని చేసిన బెస్ట్ గా ఉండాలని కోరుకుంటారు.

అందువల్ల చాలా తక్కువ సమయంలోనే ఉన్నత శిఖరాలను అందుకుంటారు.

ఎటువంటి సందర్భాన్ని అయిన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు.

ఎంతో అసూయ మరియు విపరీతమైన మొండి పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉన్నా, అదే సమయంలో ఎంతో ధైర్యవంతులుగా కనపడతారు.

ఇంటిలో బాధ్యతలను తీసుకోవటానికి వెనకడుగు వేయరు.

వీళ్ళు ఎదుటి వారిని గౌరవిస్తారు మరియు అదే గౌరవాన్ని ఎదుటివారి నుండి ఆశిస్తారు.వీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు.

ఏ విషయాన్నీ అయినా బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube