ఖమ్మం టీఆర్ఎస్ ని షేక్ చేస్తున్న 'నామా' నామస్మరణ  

Nama Nageswarao Contesting From Khammam Assembly Seat-

తెలంగాణలో అన్ని జిల్లాలతో పోల్చితే ఖమ్మం జిల్లాది ప్రత్యేకమైన స్థానం. ఇక్కడ రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది..

ఖమ్మం టీఆర్ఎస్ ని షేక్ చేస్తున్న 'నామా' నామస్మరణ -Nama Nageswarao Contesting From Khammam Assembly Seat

రాష్ట్రం విడిపోయిన తరువాత టీడీపీ కంచుకోటగా ఉన్న ఖమ్మం స్థానం చేజారిపోయింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో తన సత్తా చూపడానికి, పునర్వైభవం కోసం తెలుగుదేశం పార్టీ సిద్దమవుతోంది. అందుకు వ్యూహరచనలు కూడా చేస్తోంది.

టీఆర్ఎస్ పార్టీ ని ఎదుర్కునే దశలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మహాకూటమిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లాపై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ఒట్లుతో గెలిచి ఆ తరువాత టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన ఖమ్మం అసెంబ్లీ ఎమ్మెల్యే పువ్వాడా అజయ్ కి మళ్ళీ సీటు కేసీఆర్ సీటు కన్ఫర్మ్ చేయడంతో , కూటమి అభ్యర్ధిగా పువ్వాడ అజయ్ కి ధీటుగా సాదా సీదా వ్యక్తులని నిలబెడితే సరిపోదని భావిస్తున్న కూటమి పెద్దలు.

ఎవరిని దించాలనే ఆలోచనలో పడ్డారట

అయితే ఎమ్మెల్యే అయిన తరువాత స్థానికంగా, ఆర్ధికంగా , బలం పెంచుకున్న పువ్వాడని ఎదుర్కునే సత్తా ఎవరికి ఉందనే కోణంలో సర్వేలు కూడా చేయించారట కూటమి నేతలు. ఈ తరుణంలో కాంగ్రెస్ , టీడీపీ , వామపక్షాల కార్యకర్తలు , ప్రజల నుంచీ వినిపించిన ఏకైక పేరు నామా నాగేశ్వరరావు. 2009లో రేణుకా చౌదరిపై భారీ మెజార్టీతో ఖమ్మం జిల్లా ఎంపీగా ఘ‌న‌విజయం సాధించిన నామా గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చేతిలో కేవలం 10వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.అయితే పార్టీ మారాలని ఆయనపై వివిధ పార్టీలు ఒత్తిళ్ళు తెచ్చినా సరే ఎంతో మంది టీడీపీని వీడి టీఆర్ఎస్ లోకి జంప్ చేసినా సరే రాజకీయంగా ఎదుగుదలని ఇచ్చిన సొంత పార్టీని విడిచి నామా వెళ్ళలేదు.పార్టీనే నమ్ముకుని ఇప్పటికీ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పార్టీకి సేవలు చేస్తూనే ఉన్నారు.

ఖమ్మంలో స్థానికంగా మంచి నేతగా , పారిశ్రామికవేత్తగా , ఆర్ధికంగా కూడా బలమైన నామా ని అసెంబ్లీ బరిలోకి దింపితే తప్పకుండా విజయం వరిస్తుందని నేతలు డిసైడ్ అయ్యారట..

ఖమ్మం అసెంబ్లీ పరిధిలో మొత్తం 2 ,54 ,616 మంది ఓటర్లు ఉన్నారు…వీరిలో ముఖ్యంగా ముస్లిం ,కమ్మ , కాపు వర్గాల ఓట్లే కీలకం…వీరిలో అత్యధికంగా ముస్లిం ఓటు బ్యాంక్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉన్నా స్థిరంగా ఉండే నాయకత్వ లేమి ప్రస్తుతం వెంటాడుతోంది.

పువ్వాడ అజయ్ గతంలో కాంగ్రెస్ నుంచీ గెలిచి తనతో పాటు కాంగ్రెస్ కి ఉన్న బలమైన కేడర్ మొత్తాన్ని టీఆర్ఎస్ లోకి తీసుకుని వెళ్ళిపోయారు దాంతో కాంగ్రెస్ కి టీఆర్ఎస్ ని ఎదుర్కునే ధీటైన నేత లేకపోయారు.ఇక కూటమిలో మరొక పార్టీగా ఉన్న వామపక్షాలు సైతం పోటీ ఖమ్మం అసెంబ్లీ రేసులో దిగాలని భావిస్తున్నా, గతంలో కమ్యునిస్టు లకి ఉన్న ఆదరణం ప్రస్తుతం లేకపోవడంతో వామపక్షాల నుంచీ కూడా సరైన అభ్యర్ధిని నిలబెట్టలేని పరిస్థితి నెలకొంది.

ఇక తెలుగుదేశం పార్టీనుంచీ బలమైన అభ్యర్ధిగా నామా ఒక్కరే కనిపిస్తున్నారు. ప్రజలలో చెదిరిపోనీ ఆదరణ ఆయన సొంతం, టీడీపీ కి ఖమ్మం జిల్లాలో వెన్నెముకగా ఉన్న నామాకి బలమైన కేడర్ ఉంది. టీడీపీ హయాం లో నామా చేసిన అభివృద్ధి పనులు టీడీపీ గెలుపులో భాగం అయ్యే అవకాశాలు లేకపోలేదు.

2004 లో తెలుగుదేశం పార్టీ ఖమ్మం అసెంబ్లీ లో రెండవ స్థానంలో ఉండింది ఆ తరువాత 2009 లో తెలుగుదేశం పార్టీ ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచీ గెలుపొందింది.అయితే 2014 లో కేవలం 5 వేల ఓట్ల తేడాతో తెలుగుదేశం అభ్యర్ధి ఓడిపోయారు.

దాంతో జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్న నామా గనుకా ఈ సారి ఖమ్మం అసెంబ్లీ బరిలో దిగితే తప్పకుండా విజయం వరిస్తుందని.కూటమి మొదట గెలుచుకునే స్థానం ఖమ్మం ఖిల్లానే అని ఘంటాపథంగా చెప్తున్నారు తెలుగుదేశం నేతలు.అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఈసారి ఎలాగైనా తెలంగాణలో పట్టు సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో భాగంగానే ఖమ్మం, సత్తుపల్లి వైరా లో మాకే అవకాశం ఇవ్వాలని పట్టు బడుతున్నారట. ఎలాగో కాంగ్రెస్ కి వామపక్షాలకి బలమైన నేతలు కేడర్ కరువు ఉండటంతో కూటమి పెద్ద కాంగ్రెస్ కూడా దాదాపు ఖమ్మం , సత్తుపల్లి స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి సిద్దమయ్యిందట. దాంతో చంద్రబాబు కూడా కేడర్ పూర్తిస్థాయిలో పనిచేయాలని పిలుపు ఇచ్చారట..

ఖమ్మం అసెంబ్లీ నుంచీ నామా నిలబడుతారని ఆయనకీ పూర్తి సహకారాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారట.

ఖమ్మం అసెంబ్లీ నుంచీ నామా బరిలోకి దిగితే తప్పకుండా పువ్వాడ అజయ్ కి కోలుకోలేని దెబ్బ తగులుతుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదిలాఉంటే అసెంబ్లీ పరిధిలో కూటమి అభ్యర్ధిగా తెలుగుదేశం తరుపున నామా పేరు వినపడటంతో పువ్వాడ అజయ్ లో కొంత ఆందోళన కూడా వ్యక్తం అవుతోందని.

నామా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించే విధంగా స్థానికంగా తనకి కాంగ్రెస్ లో వారితో నిరసనలు తెలియచేసే విధంగా వ్యుహాలు పన్నుతున్నాడని తెలుస్తోందట. మొత్తానికి నామా పేరు ఇంకా ఫైనల్ అవ్వకుండానే పువ్వాడ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి అంటే నామా గెలుపుకి తిరుగులేదనే భావన వ్యక్తమవుతోందని అంటున్నారు టీడీపీ నేతలు.