తానా చైర్మెన్ గా పశ్చిమగోదావరి వాసి       2018-06-13   04:54:58  IST  Bhanu C

“తానా” అమెరికాలో తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ..అక్కడ ఉన్న ప్రవాసుల సంఘాలలో తానా అతిపెద్ద సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది..తానాలో ఉన్న తెలుగువారు ఎంతో మంది ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం అందరికీ తెలిసినదే..ఉత్తర అమెరికాలో నివసిస్తున తెలుగువారికి తానా ఒక ప్రత్యేకమైన తెలుగు సంఘం గా గురింపు పొందింది..

-

తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల మరియు వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, మరియు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి ఈ సంఘం ఏర్పాటైంది…1978 లో మొదలయ్యిన తానా..ఆతిపెద్ద ఇండో అమెరికన్ సంఘాలలో ఒకటి..అయితే

2018 కి గాను తానా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది..అందుకు గాను అమెరికాలో 11న వెబ్‌ ఆధారంగా ఈ ఎన్నిక నిర్వహించారు..ఈ ఎన్నికల్లో ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా డాక్టర్‌ ప్రసాద్‌ నల్లూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు…అయితే డాక్టర్ నల్లూరి ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి..అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా ఆయన ఎంతో పేరు సంపాదించారు..గతంలో తెలుగు వైద్యుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా వ్యవవహరించారు…ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టిన నల్లూరి ఏపీమ తెలంగాణా లో ఎంతో మందికి సుపరిచితుడు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.