తానా చైర్మెన్ గా పశ్చిమగోదావరి వాసి

“తానా” అమెరికాలో తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ.అక్కడ ఉన్న ప్రవాసుల సంఘాలలో తానా అతిపెద్ద సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది.

 Nalluri Prasad As Tana Chairman-TeluguStop.com

తానాలో ఉన్న తెలుగువారు ఎంతో మంది ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం అందరికీ తెలిసినదే.ఉత్తర అమెరికాలో నివసిస్తున తెలుగువారికి తానా ఒక ప్రత్యేకమైన తెలుగు సంఘం గా గురింపు పొందింది.

తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల మరియు వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, మరియు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి ఈ సంఘం ఏర్పాటైంది…1978 లో మొదలయ్యిన తానా.ఆతిపెద్ద ఇండో అమెరికన్ సంఘాలలో ఒకటి.అయితే

2018 కి గాను తానా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది.అందుకు గాను అమెరికాలో 11న వెబ్‌ ఆధారంగా ఈ ఎన్నిక నిర్వహించారు.ఈ ఎన్నికల్లో ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా డాక్టర్‌ ప్రసాద్‌ నల్లూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు…అయితే డాక్టర్ నల్లూరి ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి.

అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా ఆయన ఎంతో పేరు సంపాదించారు.గతంలో తెలుగు వైద్యుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా వ్యవవహరించారు…ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టిన నల్లూరి ఏపీమ తెలంగాణా లో ఎంతో మందికి సుపరిచితుడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube