ఏపీ కాంగ్రెస్ కు కొత్త బాస్ ? తెరపైకి మాజీ సీఎం ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీగా చక్రం తిప్పిన కాంగ్రెస్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినట్లుగా కనిపించినా, గతంతో పోలిస్తే తెలంగాణ కాంగ్రెస్ లో కాస్త ఊపు వచ్చింది.2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొన్ని సీట్లు దక్కడంతో ఆ పార్టీ పరిస్థితి ఫర్వాలేదు అన్నట్లుగానే ఉంది.అంతే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రావడం, ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది.ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో, ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం తీసుకురావాలని, అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ను మార్చి, ఆయన స్థానంలో మరొకరిని అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

 Nallari Kiran Kumar Reddy, Congress, Megastar Chiranjivi, Umen Chandi, Ap Congre-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేసేందుకు ఎన్నో అంశాలు ఉన్నా, అన్నిటినీ కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోలేకపోతుంది.అప్పుడప్పుడు మాత్రమే మీడియా సమావేశం నిర్వహిస్తూ, తమ ఉనికిని చాటుకుంటున్నారు.

దీని కారణంగా కాంగ్రెస్ గ్రాఫ్ ఏమాత్రం పెరగకపోవడం, 2019 ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితికి పార్టీ వెళ్లిపోవడం తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని తీవ్రంగా చర్చిస్తున్నారు.

ఇటీవలే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాందీ వద్ద మెగాస్టార్ చిరంజీవి అంశాన్ని రాహుల్ ప్రస్తావించారు.ఒక దశలో చిరంజీవికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చే అంశాన్ని ఉమెన్ చాందీ వద్ద ప్రస్తావించగా, ఆయన ఆ బాధ్యతలు స్వీకరించేందుకు ఇష్టపడకపోవచ్చు అనే అభిప్రాయంతో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.

పిసిసి అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ కాంగ్రెస్ ను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Ap Congress, Congress, Chiranjivi, Nallarikiran, Pcc, Umen Chandi, Ysrcp-

అయితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నట్లుగా కనిపించడం లేదు.అయినా ఆయన ఏదో రకంగా ఒప్పించి పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని, ఏపీ కాంగ్రెస్ లో కమిటీలను మార్చి భారీగా ని ప్రక్షాళన చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను రాహుల్ పంపిస్తుండడం తో తిరిగి కాంగ్రెస్ కు పునర్వైభవం వస్తుందేమో అన్న అసలు కాంగ్రెస్ క్యాడర్ లో కలుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube