మొదటి నుంచి ఉద్యమ నేపథ్యం ఉన్న జిల్లాగా నల్గొండకు పేరుంది.అయితే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వారందరూ రాజకీయాల్లో చక్రం తిప్పారు.
అయితే తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌లోనే ఈ జిల్లా నేతల హవా కొనసాగుతుండగా.ఇక టీఆర్ఎస్‌లో చక్రం తిప్పుతున్న మంత్రి జగదీశ్ రెడ్డికి అక్కడి కాంగ్రెస్ నేతలకు అస్సలు పడట్లేదు.
మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మంత్రిజగదీశ్ రెడ్డికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి.రీసెంట్‌గా మునుగోడు నియోజకవర్గంలోకి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి మంత్రి వెళ్లగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి అలాగే మంత్రికి పెద్ద ఎత్తున వివాదరం జరిగింది.
రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంతో ఏకంగా మంత్రి చేతుల్లోని మైకును లాక్కోవడం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది.అయితే ఈ వివాదం తర్వాత రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి కావాలనే తనను అవమానించారని, దీనికి తగ్గ ప్రతిఫలం ఉంటుందని చెప్పారు.
ఇక నిన్న బుధవారం మరోసారి మంత్రి మునుగోడుకు వెళ్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.మునుగోడులో కూడా దళిత బంధు స్కీమ్‌ను అమలు చేయాలంటూ ఏకంగా పదివేల మందితో నిరసన తెలుపుతామని ప్రకటించారు.

అయితే ఎలాగైనా మంత్రిని అడ్డుకుంటామని, మంత్రి జగదీశ్‌ను నియోజకవర్గంలో తిరగనీయమంటూ చెప్పడం సచంలనం రేపింది.ఇక మంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.ఇక మంత్రి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు.అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామంటూ చెపపడం సంచలనం రేపుతోంది.ఇక దీనిపై రాజగోపాల్ రెడ్డి అన్న వెంకట్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.తమపై కక్ష పూరితంగానే మంత్రి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక ముందు ముందు ఈ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.