ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఫేక్ సర్టిఫికెట్లు కలకలం జరిగిన సంగతి విదితమే.అయితే తాజాగా ఈ ఫేక్ సర్టిఫికెట్లు కేసుకు సంబంధించి జగిత్యాల జిల్లాలో నల్గొండ పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా , ఫేక్ సర్టిఫికెట్లు కేసులో అర్ధరాత్రి వరకు సోదాలు చేపట్టారు.స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీలో తనిఖీలు చేశారు.
పలు యూనివర్సిటీలకు సంబంధించిన పత్రాలు, సర్టిఫికెట్లు పట్టుకొని సీజ్ చేశారు.అనంతరం నిర్వాహకుడు తల్లిని అదుపులోకి తీసుకున్నారు.