అందుకే పెళ్లి కాకపోయినా పిల్లలని కన్నాను....

బాలీవుడ్లో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, సంజయ్ దత్, తదితర స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరోయిన్ “నైనా గుప్త” గురించి సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే నైనా గుప్త కేవలం నటిగా మాత్రమే కాకుండా పలు సీరియల్స్ కి చిత్రాలకు నిర్మాతగా మరియు దర్శకురాలిగా కూడా వ్యవహరించింది.

 Naina Gupta About Her Daughter And Marriage-TeluguStop.com

కానీ తన వైవాహిక జీవితంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా పెళ్లి అనే బంధానికి దూరమయింది.తాజాగా నైనా గుప్త తన జీవితగాథ ఆధారంగా ఓ పుస్తకాన్ని విడుదల చేసింది.

అయితే ఈ పుస్తకంలో తన జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర విషయాల గురించి తెలియజేసింది.

 Naina Gupta About Her Daughter And Marriage-అందుకే పెళ్లి కాకపోయినా పిల్లలని కన్నాను….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇందులో ముఖ్యంగా తన సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఓ వ్యక్తిని ప్రేమించానని ఆ వ్యక్తి కూడా తనని ప్రేమించాడని కానీ పెళ్లి చేసుకోవాలనుకున్న సమయానికి తన ప్రియుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని దాంతో తమ ప్రేమ పెళ్లికి దారి తీయలేదని చెప్పుకొచ్చింది.

దాంతో కొంతకాలం పాటు డిప్రెషన్లోకి వెళ్లినప్పటికీ తొందరగానే కోలుకున్నానని, ఆ తర్వాత మళ్లీ పెళ్లయ్యి పిల్లలు ఉన్నటువంటి ఓ వ్యక్తి తో ప్రేమలో పడ్డానని కానీ కానీ ఆ బంధం కూడా పెళ్లికి దారి తీయలేదని దాంతో తనకంటూ ఒక కుటుంబం ఉండాలని పెళ్లి కాకపోయినప్పటికీ ఒక కూతురుని కన్నానని తెలిపింది.అయితే ఈ పెళ్లి బంధం తన కూతురికి కూడా పెద్దగా అచ్చి రాలేదని కొంతమేర ఎమోషనల్ పదాలను లిఖించింది.

Telugu Bollywood, Masaba Gupta, Naina Gupta, Naina Gupta About Her Daughter And Marriage, Naina Gupta Daughter And Marriage-Movie

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నైనా గుప్త హిందీలో ప్రముఖ దర్శకుడు కేశవన్ నాయర్ దర్శకత్వం వహించిన “సర్దార్ కా గ్రాండ్ సన్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.కానీ ప్రస్తుతం “కరోనా వైరస్” కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు.కాగా ప్రస్తుతం నైనా గుప్త హిందీలో “డయల్ 100 మరియు గ్వాలియర్” అనే చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తోంది.

#Naina Gupta #NainaGupta #NainaGupta #Masaba Gupta

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు