అరియానా రిలేషన్ షిప్ సీక్రెట్స్ చెప్పేసిన సోదరి!  

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్ లో పాపులారిటీ సంపాదించుకున్న అరియానా గ్లోరీ బిగ్ బాస్ షోలో పాల్గొని రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.పెద్దగా ఫేమ్ ఉన్న సెలబ్రిటీ కాకపోవడంతో అరియానా బిగ్ బాస్ హౌస్ లో రెండు మూడు వారాల్లో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వినిపించినా టాస్కులను విజయవంతంగా పూర్తి చేస్తూ 13వ వారంలో కూడా అరియానా కొనసాగుతున్నారు.

TeluguStop.com - Naina Glory Reveals Her Sister Reveals Her Sister Relationship Status

బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్లలో అరియానా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అరియానా గ్లోరీ చెల్లెలు నైనా గ్లోరీ మీడియా ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్య్వూలు ఇస్తూ అక్కకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

తమ కుటుంబం తరపున బిగ్ బాస్ హౌస్ కు అరియానాను కలవడానికి వెళ్లిన వినీత్ అరియానా బాల్య స్నేహితుడిని.అరియానా కెరీర్ లో ఎదగడంలో వినీత్ పాత్ర ఎంతో ఉందని అన్నారు.

TeluguStop.com - అరియానా రిలేషన్ షిప్ సీక్రెట్స్ చెప్పేసిన సోదరి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అరియానా రిలేషన్ షిప్ స్టేటస్ గురించి స్పందిస్తూ మారుతున్న కాలంతో పాటే లవ్ స్టోరీలు, బ్రేకప్ లు ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ అయ్యాయని.అక్క లైఫ్ లో కూడా ఎవరైనా ఉండవచ్చని నైనా గ్లోరీ చెప్పారు.పరోక్షంగా అరియానాకు లవ్ స్టోరీ ఉందని నైనా చెప్పినా ఆ విషయాలను మాత్రం ఆమె వెల్లడించలేదు.అక్క కూకట్ పల్లిలో ఉంటుందని.తనకు, అక్కకు సరదాగా గొడవలు జరుగుతాయని నైనా అన్నారు.

తను జాబ్ చేస్తానని అందువల్ల తాను అక్కతో కాకుండా ఆఫీస్ కు దగ్గరలోనే ఉంటానని నైనా తెలిపారు.

తను, అరియానా చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు అన్నీఇన్నీ కావని.తినడానికి సరైన తిండి లేక దొడ్డు బియ్యం తిన్న రోజులు కూడా తమ జీవితంలో ఉన్నాయని ఆమె తెలిపారు.

బిగ్ బాస్ ప్రేక్షకులు అరియానాపై ప్రేమ చూపిస్తూ ఉండటం ఎంతో సంతోషంగా ఉందని నైనా గ్లోరీ పేర్కొన్నారు.

#Naina Glory #Ram Gopal Varma #Ariyana Glory

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు