వర్మ హీరోయిన్‌లను ఇండస్ట్రీ బాగానే వాడేస్తుందిగా..!  

naina ganguly and apsara rani busy with movies because of rgv,naina ganguly, apsara rani ,krack movie, special song, RGV, Thriller, Dangerous movie - Telugu Apsara Rani, Breaking News, Ram Gopal Varma, Rgv, Sri Rapaka, Telugu Film News

రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాల్లో నటించిన వారు ఈమద్య కాలంలో ఎక్కువగా వివాదాస్పదం అవ్వడం వల్ల ఇతర సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోలేక పోతున్నారు.అంటే వర్మ తీసే వివాదాస్పద సినిమాల్లో నటించడం వల్ల ఇతర ఆఫర్లు పొందకుండా కెరీర్‌ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

TeluguStop.com - Naina Ganguly And Apsara Rani Busy With Movies Rgv

కాని ఈమద్య ఇద్దరి విషయంలో మాత్రం అది రివర్స్‌ అయ్యింది.వర్మ లాక్‌ డౌన్‌ లో రూపొందించిన మూవీ నగ్నం.

ఆ సినిమాలో శ్రీ రాపాక హీరోయిన్‌ గా నటించింది.ఆమె ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయినా కూడా ఆమెను ఎవరు పట్టించుకోలేదు.

TeluguStop.com - వర్మ హీరోయిన్‌లను ఇండస్ట్రీ బాగానే వాడేస్తుందిగా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

వర్మకు ఆమె ఆఫర్‌ ఇవ్వడంతో తన సత్తాను ఆమె నిరూపించుకుంది.ఆ సినిమాలో సత్తా చాటడంతో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

ఆమెను ఇండస్ట్రీ బీ గ్రేడ్‌ హీరోయిన్‌ గా గుర్తించినట్లుగా టాక్‌ వినిపిస్తుంది.ఆమె తాజాగా ఒక బోల్డ్‌ సినిమాలో నటించింది.

ఆ సినిమాకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.వర్మ స్థాయిలో కాకున్నా ఆ చిత్ర దర్శకుడు శ్రీ రాపాకను బాగానే చూపించినట్లుగా అనిపించింది.

వర్మ థ్రిల్లర్‌ సినిమాతో పరిచయం చేసిన ముద్దుగుమ్మ అప్సర రాణి.ఈమె కూడా తెలుగులో అంతకు ముందే నటించింది.కాని ఈమెను అప్పుడు ఎవరు పట్టించుకోలేదు.ఇప్పుడు ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్‌ మూవీలో ఈమె ఐటెం సాంగ్‌ ను చేసింది.వర్మ సినిమాతో ఈమెకు వచ్చిన గుర్తింపు ఆ ఐటెం సాంగ్‌ను తెచ్చి పెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వర్మ ప్రస్తుతం ఆమెతో డేంజరస్‌ అనే సినిమాను తీస్తున్నాడు.ఆ సినిమాతో మరెంతగా వర్మ ప్రేక్షకులను ఆమెతో ఎంటర్‌ టైన్‌ చేస్తాడో చూడాలి.

మొత్తానికి వర్మ వల్ల వీరిద్దరు బిజీ అయ్యారు.డేంజరస్‌ లో నటిస్తున్న నైనాగంగూలీ కూడా ఆ తర్వాత బిజీ అవుతుందేమో చూడాలి.

#Ram Gopal Varma #Apsara Rani #Sri Rapaka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Naina Ganguly And Apsara Rani Busy With Movies Rgv Related Telugu News,Photos/Pics,Images..