వ‌ర్షాకాలంలోనూ గోళ్లు బ‌లంగా ఉండాలా? అయితే ఇలా చేయండి?!

సాధార‌ణంగా వ‌ర్షాకాలంలో తేమ కార‌ణంగా గోళ్లు త‌ర‌చూ విరిగిపోతూ ఉంటాయి.దాంతో అంద‌మైన‌, పొడ‌వాటి గోళ్లు కావాల‌ని కోరుకునే మ‌గువ‌లు తెగ బాధ ప‌డి పోతూ ఉంటారు.

 Nail Care Tips In Monsoon! Nail Care Tips, Monsoon, Nail Care, Healthy Nails, La-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే ఏం చేయాలో తెలియ‌క‌, గోర్లు విర‌గ‌డాన్ని ఎలా త‌గ్గించుకోవాలో అర్థంగాక తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అయితే ఎలాంటి చింతా ప‌డ‌కుండా ఇంట్లోనే కొన్ని కొన్ని సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే సుల‌భంగా గోళ్ల‌ను బ‌లంగా మార్చుకోవ‌చ్చు.

మ‌రి ఆ చిట్కాలు ఏంటో లేట్ చేయ‌కుండా చూసేయండి.

బ‌ల‌హీన‌మైన గోళ్ల‌ను బ‌లంగా మార్చ‌డంలో పెట్రోలియం జెల్లీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

పెట్రోలియం జెల్లీని గోర్ల‌కు అప్లై చేసి మ‌ర్ద‌నా చేసుకోవాలి.బాగా డ్రై అయిన త‌ర్వ‌త సోప్ యూజ్ చేసి చేతుల‌ను శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే గోళ్లు త‌ర‌చూ విరిగిపోకుండా ఉంటాయి.

Telugu Tips, Healthy Nails, Latest, Monsoon, Nail Care, Nail Care Tips-Telugu He

ఆపిల్‌ సిడార్‌ వెనిగర్ కూడా గోళ్ల‌కు ఎంతో మేలు చేస్తుంది.ప్ర‌తి రోజు గోళ్లకు ఆపిల్‌ సిడార్‌ వెనిగర్ రాసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయి.పొడ‌వుగా కూడా పెరుగుతాయి.

Telugu Tips, Healthy Nails, Latest, Monsoon, Nail Care, Nail Care Tips-Telugu He

ఇంటి ప‌నులు చేసే స‌మ‌యంలో గోళ్లు నీటిలో నాని పోవ‌డం వ‌ల్ల కూడా బ‌ల‌హీనంగా మారి విరిగిపోతాయి.అందుకే ఇంటి పనులు చేసే క్రమంలో చేతులకు గ్లౌజులు వాడడం మంచిది.

అలాగే గోళ్లకు కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే నెయిల్ పాలిష్‌లు కాకుండా బేస్‌కోట్‌ నెయిల్‌ పాలిష్‌లు వాడాలి.ఇవి గోళ్లకు రక్షణ కవచంలా పని చేస్తాయి.త‌ద్వారా నీటిలో త‌డిచినా విర‌గ‌కుండా ఉంటాయి.

విటమిన్-ఇ ఆయిల్ సైతం బ‌ల‌హీన‌మైన గోళ్ల‌ను బ‌లంగా మారుస్తుంది.

విటమిన్ ఇ క్యాప్య్సూల్స్ ను బ్రేక్ చేసి అందులోని ఆయిల్‌ను తీసుకుని రాత్రి నిద్రించే ముందు గోళ్ల‌కు అప్లై చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube