నిన్నటి వరకు సింగపూర్ ... ఇప్పుడు చైనా     2015-11-23   08:22:15  IST  Bhanu C

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి సంబంధించి నిన్నటివరకు సింగపూర్ను బాగా పొగిడారు. ఎపీని సింగపూర్ మాదిరిగా చేస్తానని చెప్పారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ తయారీ సింగపూరుకు అప్పగించారు. నిర్మాణ బాధ్యతలు ఎక్కువ భాగం దానికే ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ రోజు చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి, ఆయన వెంట ఒక ప్రతినిధి బృందం అమరావతికి వచ్చారు. వారు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. వెంటనే చంద్రబాబు చైనాను ప్రశంసించారు. అభివృద్దిలో చైనా తమకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. చైనా ప్రతిపాదించిన సిల్క్ రూటును విశాఖపట్నం మీదుగా తీసుకుపోవాలని కోరారు. పెట్టుబడులకు షాంగై తరువాత అమరావతిని రెండో కేంద్రంగా పరిగణించాలని కోరారు. అమరావతి నిర్మాణంలో చైనా భాగస్వామి కావాలని కోరారు. మరిన్ని చైనా కంపెనీలను అమరావతి నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని చైనా మంత్రి చెప్పారు. చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా విదేశాలకు అప్పగించేశారు.