ఈమధ్య కాలంలో కొందరు అవగాహన లేమి కారణంగా తీసుకున్నటువంటి నిర్ణయాలతో తమ జీవితాలను చిక్కుల్లో పడేసుకుంటున్నారు.కాగా ఇటీవలే ప్రేమలో మోసపోయి గర్భం దాల్చడంతో ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిస్తే పరువు పోతుందని చివరికి యూట్యూబ్ లో వీడియోలు చూసి తనకి తానుగా అబార్షన్ చేసుకునేందుకు యత్నించిన ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని నాగపూర్ పరిసర ప్రాంతంలో 22 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది ఇటీవలే స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడి ప్రేమలో పడింది.వీరిద్దరూ ఎక్కడికెళ్లినా చెట్టాపట్టాలేసుకుని తిరిగే వాళ్ళు ఈ క్రమంలో పెళ్లి కాకుండానే తన ప్రియుడితో హద్దులు దాటింది.
దీంతో ఈ విషయం తెలుసుకున్న యువతి తనను పెళ్లి చేసుకోవాలని తన ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది.దాంతో తన కామ కోరికలు తీర్చు కున్న ప్రియుడు ప్రియురాలి తో పెళ్లి కి నిరాకరించాడు.
అంతేకాకుండా ప్రస్తుతం తాను పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేదని తెగేసి చెప్పాడు.
దీంతో యువతి తనకు పుట్టబోయే బిడ్డ గురించి తన ప్రియుడికి తెలియజేస్తూ తనని పెళ్లి చేసుకోకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తానని బెదిరించింది.దాంతో ప్రియుడు ఈ విషయాన్ని సున్నితంగా డీల్ చేయాలి అని ఆలోచించి ప్రస్తుతం తనకు సంపాదన లేకపోవడంతో పెళ్లి చేసుకున్నప్పటికీ కుటుంబాన్ని పోషించాలని కాబట్టి కొంత కాలం పాటు వాయిదా వేస్తూ అబార్షన్ చేయించుకోమని నెమ్మదిగా తన ప్రియురాలికి నచ్చజెప్పాడు.అంతటితో ఆగకుండా యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ చేసుకోమని సలహా కూడా ఇచ్చాడు.
దీంతో తన ప్రియుడు మాటలన్నీ నమ్మినా యువతి యూట్యూబ్ లో వీడియోలను చూస్తూ సొంతంగా అబార్షన్ చేసుకోవడానికి ప్రయత్నించింది.ఈ క్రమంలో మర్మాంగాల వద్ద గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.
దీంతో యువతి తల్లి ఈ విషయం గురించి ప్రశ్నించడంతో యువతి తన ప్రియుడి గురించి మరియు గర్భం గురించి తల్లిదండ్రులకు తెలియజేసింది.దాంతో వెంటనే యువతిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం అందించింది.