బిగ్ బాస్ 4వ సీజన్ విన్నర్ ఆమెనంట...

తెలుగులో ప్రారంభించిన అనతికాలంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకుని విజయవంతంగా మూడు సీజన్లను పూర్తిచేసుకుని నాలుగో సీజన్ ని ఇటీవలే మొదలు పెట్టింది బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో.అయితే ఈ షో లో తెలుగు ప్రముఖ వార్తా ఛానల్ అయిన  టీవీ-9 లో పని చేస్తున్న న్యూస్ రీడర్ మరియు జర్నలిస్ట్ దేవి నాగవల్లి కంటెస్టెంట్ గా పాల్గొంటోంది.

 Ka Paul Fans Announced Telugu Bigg Boss Season 4 Winner As A Nagavalli Nagavall-TeluguStop.com

దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లలో బాగానే ట్రోల్స్  చేస్తూ మరియు మీమ్స్  క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారు.

అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా అప్పట్లో దేవి నాగవల్లి ప్రజా శాంతి పార్టీ అధినాయకుడు కె.

ఏ పాల్ ని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో కె.ఏ పాల్ సార్వత్రిక ఎన్నికల విజయం కోసం చేసినటువంటి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే వంద శాతం ఓట్లు దేవి నాగవల్లి కే పడతాయని ఆమె బిగ్ బాస్ నాలుగవ సీజన్ విన్నర్ అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.అంతేగాక అప్పుడే కొంతమంది సోషల్ మీడియా మాధ్యమాలలో దేవి నాగవల్లి ఆర్మీ అంటూ ఖాతాలను కూడా సృష్టించి ఆమె గురించి ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా దేవి నాగవల్లి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది.

చిన్నప్పటి నుంచి ప్రజా సమస్యలపై అవగాహన ఉండడంతో జర్నలిజం చేసింది.దాంతో ప్రస్తుతం దేవి నాగవల్లి ప్రముఖ వార్తా చానల్ అయినటువంటి టీవీ-9 ఛానల్ లో పని చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube