ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో పాలమూరు బిడ్డ మృతి!

పై చదువుల కోసం పట్టణాలను వదిలి ఇతర దేశాలకు వెళ్తున్న విద్యార్థులు.అక్కడి చదువుల కై కుటుంబ సభ్యులను విడిచి మరి ఇప్పటికీ కూడా పయనమవుతునే ఉన్నారు.

 Telangana Girl Killed In Bike Accident , Australia, Bike Accident, Girl, Killed,-TeluguStop.com

తమ పిల్లల చదువుల కోసమై.ఉన్నత స్థాయికి ఎదగాలంటూ తల్లిదండ్రులు కూడా పిల్లలను దూరంగా పంపిస్తున్నారు.

కాగా ఇదిలా ఉంటే దూరపు చదువుల కోసం వెళ్లిన బిడ్డ ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరిని బాధ పడేలా చేసింది.

తెలంగాణలో వంగూరు మండలం, దిండి చింతపల్లి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి, అనిత.

వీళ్ళకి కూతురు, కుమారుడు ఉన్నారు.కాగా ప్రస్తుతం వీళ్ల కుటుంబం హైదరాబాదులోని మీర్ పేట్ లో నివాసముంటున్నారు.

వెంకటరెడ్డి ఆర్మీ రిటైర్మెంట్ కాగా ప్రస్తుతం డీ ఆర్ డీ ఏ లో పనిచేస్తున్నాడు.తమ కూతురు రక్షిత(22) ఎంఎస్ చదువు కోసం ఆస్ట్రేలియా కు వెళ్ళింది.

సిడ్నీలోని ఐఐబిఐటీ యూనివర్సిటీలో గత ఏడాది ఎంఎస్ లో చేరింది.

Telugu Australia, Bike, Nagarkurnool, Road, Telangana Bike-Telugu NRI

కాగా ఇటీవలే గురువారం రోజున తన ద్విచక్ర వాహనం పై రోడ్డుపై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది.దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు.

చేసేది ఏమీ లేక అక్కడి స్థానికులు దక్షిత వివరాలు సేకరించి తమ కుటుంబ సభ్యులకు తెలపడానికై హైదరాబాదులో నివాసం ఉంటున్న తమ కుటుంబ సభ్యులకు ఈ సమాచారమును తెలిపారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

పై చదువుల కోసం వెళ్ళిన తన బిడ్డ ఇక లేదని.అనంతలోకాలకు వెళ్లిపోయిందని.

తన ఇంటి దీపం ఆరిపోయిందని.ఇక రాదని తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు ఆగిపోయేలా బోరుమన్నారు.

కాగా ఆస్ట్రేలియా నుంచి రక్షిత మృతదేహాన్ని తీసుకొని రావడానికి కొన్ని సదుపాయాలు కల్పించిన అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube