కొవిడ్‌ నిబంధనల మధ్య నేడు జరగనున్న నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్.. !

తెలంగాణలో మరో ఎన్నిక పోరుకు ఈరోజు తెరపడనుంది.ఇప్పటి దాకా పలు విమర్శనాస్త్రాలు, ఆరోపణలు, వివాదస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ పార్టీలు నాగార్జున సాగర్ లో ప్రచారం చేసుకున్నాయి.

 Nagarjuna Sagar By Elections Polling To Be Held Today Amidst Covid Rules, Nagarj-TeluguStop.com

ఈ పోటీ కాశ్మీర్ సమస్యకంటే తీవ్రంగా పరిగణించిన తెలంగాణ రాజకీయ పార్టీలు పాకిస్దాన్‌తో యుద్ధం చేస్తున్నట్లుగా భావించాయి.మొత్తానికి ఈ రోజుతో ఈ సమరం ముగియనుంది.

ఈ క్రమంలో సాగర్‌ ఉప ఎన్నికకు సంబంధించి శనివారం జరగనున్న పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.ఇక్కడ అధికారులు కొవిడ్‌ నిబంధనల మేరకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

కాగా కొవిడ్‌ పాజిటివ్‌గా ఉన్నవారు సాయంత్రం 6గంటల తరువాత ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు.

ఇకపోతే సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,20,300 ఓటర్లు ఉండగా, 8151 పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్నాయి.

అయితే ఏకంగా 41 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో మూడు బ్యాలెట్‌ యూనిట్లను వినియోగిస్తు, మొత్త 346 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఇక ఈ పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పొడిగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube