టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.ఈ మధ్యే ఆయన నటించిన బంగార్రాజు సినిమాతో మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
నాగ చైతన్య తో కలిసి నటించిన కూడా కొడుకుకి మించి యాక్టివ్ గా కనిపించాడు.ఈయన ఇప్పటికి యంగ్ గా కనిపిస్తున్నాడు అంటూ అభిమానులు ఆయనను పొగుడుతూనే ఉన్నారు.
ఇక బంగార్రాజు తర్వాత ప్రెసెంట్ నాగార్జున నటిస్తున్న సినిమాల్లో యాక్షన్ థ్రిల్లర్ ది గోస్ట్ సినిమా ఒకటి.ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవలే రివీల్ చేసిన పోస్టర్ తోనే మంచి అంచనాలు క్రియేట్ అవ్వగా.ఇక ఈ సినిమా నుండి తాజాగా మరొక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఇక ఈ సినిమా నుండి ఎప్పుడో ఒక వీడియో రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు.మరి ఇప్పటికి ఆ వీడియోను రిలీజ్ చేసారు.ఈ వీడియో చూస్తుంటేనే ఈ సినిమా సాలిడ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది.అలాగే నాగార్జున నెవర్ బిఫోర్ రోల్ లో కనిపించ బోతున్నాడని చూస్తుంటే అర్ధం అవుతుంది.
ఈ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది.ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ ను ఇష్టపడే ఫ్యాన్స్ కు సాలిడ్ ట్రీట్ లాగా అనిపిస్తుంది.
ఈ వీడియోలో నాగ్ తనకి కత్తిని రెడీ చేసుకునే విజువల్స్ కన్నుల విందుగా ఉండడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టు కునే విధంగా ఉంది.ఇక ఈ వీడియోతో పాటు ట్రైలర్ కూడా రిలీజ్ రిలీజ్ చేసే డేట్ కూడా ఫిక్స్ చేసారు.
ఆగష్టు 25న ఈ సినిమా నుండి ట్రైలర్ రాబోతుంది.ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నారు.