ఈ సంక్రాంతికి నందమూరి మరియు అక్కినేని హీరోలు నటించిన ‘డిక్టేటర్’, ‘నాన్నకు ప్రేమతో’ మరియు ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే ‘డిక్టేటర్’ మరియు ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలు విడుదల డేట్ ఫిక్స్ అయ్యాయి.
తాజాగా ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రం డేట్‌ను ఫిక్స్ చేశారు.నిన్న జరిగిన ఆడియో వేడుకలో నాగార్జున మరో సారి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అని అధికారికంగా ప్రకటించాడు.
ఈ ఆడియో వేడుకలో నాగార్జున మాట్లాడుతూ.ఈ సంక్రాంతికి మేము రావడం ఖాయం, విజయం సాధించడం ఖాయం అంటూ నమ్మకంగా చెప్పాడు.
రాబోయే సంక్రాంతికి నేనే విజేతను అంటూ నాగార్జున చెప్పకనే చెప్పాడు.ఈ మాటల ద్వారా నందమూరి హీరోలకు గట్టి సవాల్‌ను నాగార్జున విసిరాడు.
నందమూరి హీరోలు నటించిన ‘డిక్టేటర్’ మరియు ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలు సైతం సంక్రాంతికి సందడి చేయడం ఖాయం అంటున్నారు.దాంతో ఈ ముగ్గురు హీరోలు సంక్రాంతికి సందడి చేయడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.