తన డ్రీం ప్రాజెక్ట్ డిజిటల్ మ్యూజియం ఏర్పాటుకి కింగ్ నాగ్ ప్రయత్నాలు

కింగ్ నాగర్జున ఈ మధ్యకాలంలో రెగ్యులర్ కమర్శియల్ జోనర్ కథలు పక్కన పెట్టి తనకి సరిపోయే స్టోరీస్ ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.తాజాగా వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

 Nagarjuna's Dream About Building A Museum For Telugu, Tollywood, Old Classic Mov-TeluguStop.com

ఈ మూవీ డిజిటల్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు.

మరో వైపు నిర్మాతగా కూడా తన టేస్ట్ కి తగ్గ సినిమాలు నిర్మిస్తున్నాడు.అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత బాద్యతలని తన మేనకోడలు సుప్రియకి అప్పగించాడు.

ఇదిలా ఉంటే అన్నపూర్ణ స్టూడియో పేరుతో త్వరలో ఒటీటీ ఏర్పాటుకి కింగ్ నాగార్జున రెడీ అవుతున్నారని టాక్ వచ్చింది.అయితే ఒటీటీ బిజినెస్ సంగతి ఏంటి అనేది తెలియదు కాని త్వరలో డిజిటల్ సినీ మ్యూజియంని ఏర్పాటు చేయడానికి మాత్రం కింగ్ నాగార్జున రెడీ అవుతున్నారు.

ఇప్పటికే దానికి సంబందించిన కార్యాచరణ మొదలైంది.తెలుగు సినిమాకి సంబంధించి మ్యూజియం ఏర్పాటు చేయాలని కింగ్ నాగార్జున డ్రీమ్ ప్రాజెక్ట్ అని తాజాగా చెప్పుకొచ్చారు.

ఏదో అలా సినిమాలు చేస్తూ పోవడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రారంభమైనప్పటి నుంచి అన్ని సినిమాలు ఈ మ్యూజియంలో విజువల్ గా ఉండే విధంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.భవిష్యత్తు తరాల వారు తెలుగు సినిమా గురించి తెలుసుకోవడానికి ఈ మ్యూజియం ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఇలా సినిమా మ్యూజియ ఏర్పాటుకి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు.

ఇప్పటికే తన తండ్రి నటించిన అన్ని సినిమాలని కలెక్ట్ చేసి వాటిని మళ్ళీ డిజిటలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.దీని తర్వాత మిగిలిన సినిమాలని కూడా కలెక్ట్ చేసి డిజిటలైజ్ చేయనున్నట్లు తెలిపారు.

ఇలా తెలుగు సినిమా ఆరంభం నుంచి ఇప్పటి వరకు, ఇకపై తీయబోయే అన్ని సినిమాలు డిజిటల్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube