సాగర్ పోరులో కారు స్పీడ్‌కు బ్రేక్‌లు పడేనా.. హస్తం ఆశలు చిగురించేనా.. కమళం వికసించేనా.. ?

ఒకప్పుడు ఎన్నికలు అంటే ప్రజలకు గానీ పార్టీలకు గానీ అంతగా పట్టింపు ఉండేది కాదు.కానీ కాలం మారింది, పార్టీలు కూడా అప్‌డేట్ అయ్యాయి.

 Nagarjunansagar By Election, Nagarjunansagar, By Election, Trs, Congress, Bjp-TeluguStop.com

ప్రస్తుతం రాజకీయ నాయకులకు ఎన్నికలే ముఖ్యం ఆయ్యాయి.ఎప్పుడో గానీ రాని ఎన్నికలు ఇప్పుడు మాత్రం నెల నెల గ్యాప్ లేకుండా రావడంతో ప్రజల్లో ఆయా పార్టీల పై అయిష్టత ఏర్పడుతుందట.

అంతే కాదు ప్రభుత్వాలు కూడా ఎన్నికల మీద ప్రత్యేక దృష్టి పెడుతూ, వీటిని ప్రతిష్టంగా తీసుకుని నిర్వహించడం.ఇందు వల్ల ప్రజలు ఇబ్బందులు తలెత్తడంతో తలనొప్పిగా మారాయని అనుకునే వారు కూడా లేకపోలేదు.

ఇకపోతే చాలా రోజుల నుండి నేతలను టెన్షన్ పెడుతున్న నాగార్జున‌సాగర్ ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.కాగా ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

పార్టీల ప్రచారంతో పాటుగా, కరోనా వ్యాప్తిని కూడా విజయవంతంగా ముగించిన నేతలు ఈ ఎన్నికల్లో మేమే గెలుస్తామంటే మేమే గెలుస్తాం అనే ధీమాలో ఉన్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే సాగర్ ఉప పోరులో కారు స్పీడ్‌కు బ్రేక్‌లు పడేనా.

హస్తం ఆశలు చిగురించేనా.కమళం వికసించేనా.

అనే సందేహం నియోజకవర్గంలోనే కాకుండా.రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందట.

దీని మీద కొంతమంది బెట్టింగ్‌లకు పాల్పడుతూ, వేలు, లక్షల్లో గెలుపు గుర్రాలపై పందాలు కాస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఇకపోతే ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మే 2వ తేది వరకు ఆగవలసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube