ఆల్ ది బెస్ట్ కోడలా అంటూ విష్ చేసిన నాగ్ మామ…!  

Nagarjuna Wishes Samantha on New Cloth Store SAKI Opening, Samantha Akkineni, nagarjuna twitter, SAKI Store, Samantha New business - Telugu @iamnagarjuna, Naga Chaithya, Nagarjuna, Nagarjuna Twitter, Nagarjuna Wishes Samantha On New Cloth Store Saki Opening, Saki Store, Samantha, Samantha Akkineni, Samantha New Business

తాజాగా అక్కినేని సమంతకు తన మామ అక్కినేని నాగార్జున బెస్ట్ విషెస్ తెలియజేశాడు.అక్కినేని వారసుడు నాగచైతన్య ను ప్రేమించి వివాహం చేసుకుంది సమంత.

TeluguStop.com - Nagarjuna Wishes Samantha Saki Brand Cloth Store

సమంత నాగచైతన్య పెళ్లి జరిగినప్పటి నుంచి ఒకవైపు సినిమాలలో విజయం సాధిస్తూనే, మరోవైపు కుటుంబానికి తగ్గట్టుగానే బిజినెస్ లో దూసుకెళ్తుంది.చైతన్య తో పెళ్లి జరిగిన తర్వాత ఇద్దరూ కలిసి మొదటగా మజిలీ సినిమా లో సక్సెస్ సాధించినా, ఆ తర్వాత సమంత సోలోగా ‘ ఓ బేబీ’ సినిమా హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ఒక వైపు అక్కినేని హీరోలు హిట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటే సమంత మాత్రం సులువుగా సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుని వెళ్తుంది.

TeluguStop.com - ఆల్ ది బెస్ట్ కోడలా అంటూ విష్ చేసిన నాగ్ మామ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఇదివరకే సమంత తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఫ్రీ స్కూల్ స్టార్ట్ చేసింది.

ఇక ఇది పక్కన పెడితే.తాజాగా అక్కినేని సమంత వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది.

ఆ వ్యాపారానికి తన పేరును కలిసి వచ్చేలా ‘ సాకీ’ అనే బ్రాండెడ్ మహిళల ఫ్యాషన్ వస్త్రాలను లాంచ్ చేసింది.అయితే ఇది వరకే దీనికి సంబంధించి బ్రాండ్ ను సోషల్ మీడియాలో అభిమానులకు పరిచయం కూడా చేసింది.

ఇందుకు సంబంధించి సమంత తన ట్విట్టర్ ద్వారా ‘ కొత్తగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.దానికి సరైన వేదిక సాకీ బ్రాండ్’ అంటూ సమంత చేసిన ప్రచారం ఆమె అభిమానులతోపాటు మామూలు ప్రజలు కూడా బాగానే చేరింది.

నేడు సమంత ఈ బ్రాండ్ ను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇలా సమంత ప్రారంభించిన కొత్త వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు కోడలుకు ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియజేశాడు కింగ్ నాగార్జున.

నువ్వు మొదలు పెట్టిన వ్యాపారంలో తప్పక రాణిస్తావు అని విషెస్ కూడా తెలిపాడు.ఇలా విషెస్ తెలిపిన నాగార్జునకు సమంత ‘థాంక్యూ మామ.’ అని రిప్లై కూడా ఇచ్చింది.ప్రస్తుతం కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టిన నాగచైతన్య, సమంత కు వారి అభిమానులతో పాటు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

#SAKI Store #Samantha #Naga Chaithya #NagarjunaWishes #SamanthaNew

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagarjuna Wishes Samantha Saki Brand Cloth Store Related Telugu News,Photos/Pics,Images..