రష్మిక మందనని చాలెంజ్ చేసిన కింగ్ నాగార్జున

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీ చాలెంజ్ లకి మంచి క్రేజ్ ఉంటుంది.ఎవరో ఒక సెలబ్రిటీ స్టార్ట్ చేసిన చాలెంజ్ ని ఒకరి తర్వాత ఒకరు చేస్తూ వాటికి హైప్ తీసుకొస్తున్నారు.

 Nagarjuna Wild Dog Push Up Challenge To Rashmika​, Tollywood, Rashmika Mandann-TeluguStop.com

లాక్ డౌన్ టైంలో ఫిట్ నెస్ చాలెంజ్ లని సెలబ్రిటీలు చేయడంతో పాటు మరో ముగ్గురికి చాలెంజ్ ఇచ్చి కాలక్షేపం చేశారు.ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం తరుపున ప్లాంట్ ఏ ట్రీ చాలెంజ్ మొదలు పెట్టారు.

ఈ చాలెంజ్ లో టాలీవుడ్ లో పాటు ఆల్ ఓవర్ ఇండియాలో చాలా మంది సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేశారు.ఇదిలా ఉంటే తాజాగా కింగ్ నాగార్జున తన కొత్త సినిమా వైల్డ్ డాగ్ ప్రమోషన్ లో భాగంగా వైల్డ్ డాగ్ పుష్ అప్ చాలెంజ్ మొదలు పెట్టాడు.

పుష్ అప్ చాలెంజ్ లో భాగంగా కింగ్ నాగార్జున తాను పుష్ అప్స్ చేసి ఆ చాలెంజ్ ని రష్మిక మందనకి ఇచ్చాడు.సోష‌ల్ ‌మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానుల్లో జోష్ నింపే క‌న్న‌డ భామ ర‌ష్మిక మందన్న ముందుగా వైల్డ్ డాగ్ పుష్ అప్ చాలెంజ్ చూసి కొన్ని సెకన్ల పాటు పుష్‌అప్‌ పొజిషన్‌లో ఉండి దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది.

రష్మిక షేర్ చేసిన చూసిన కింగ్ నాగార్జున కూడా పుష్‌అప్‌ పొజిషన్‌లో చాలా సేపు ఉండి, దాన్ని బీట్‌ చేయాలంటూ రష్మికకు మరో ఛాలెంజ్‌ విసిరారు.యూ నీడ్‌ టు బీట్‌ దిస్‌ డియర్‌ అంటూ తన పోస్ట్‌కి ఆమె ఖాతాను ట్యాగ్‌ చేశారు.

ఆయన చేసిన పుష్‌ అప్ వీడియో‌ని కూడా జత చేశారు.దీనిపై రష్మిక కూడా సరదాగా రెస్పాండ్ అయ్యింది.సర్, నేను ఇంకా కష్టపడుతున్న.ఏదో ఒక రోజు కచ్చితంగా మీకు బాడీ గార్డ్ గా అపాయింట్ అవుతా అని కామెంట్స్ పెట్టింది.

దీనిపై నెటిజన్లు కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Telugu Rashmika, Nagarjuna, Wild Dog, Rashmika Ups, Telugu, Tollywood-Movie

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube