రిలీజ్ కు ముందే లీకైన వైల్డ్ డాగ్.. టెన్షన్ లో ఫ్యాన్స్..?

నాగార్జున హీరోగా దియామీర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమా రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో లీకైనట్టు ప్రచారం జరుగుతోంది.

 Hero Nagarjuna Wild Dog Movie Leaked Online News Goes Viral In Social Media, Nag-TeluguStop.com

పలు పైరసీ సైట్లలో ఈ సినిమా లింక్ లు దర్శనిమిచ్చాయి.ఈ సినిమాలో నాగార్జున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు ఎక్కుమంది కొత్త దర్శకులు, సాంకేతిక నిపుణులు పని చేస్తుండటం గమనార్హం.

అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే పలు పైరసీ వెబ్ సైట్లలో దర్శనమివ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ అవాక్కయ్యారు.

అయితే పైరసీ లింక్ లను చిత్రయూనిట్ వెంటనే తొలగించి నష్టం జరగకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది.అయితే సినిమా లీక్ కాలేదని చిత్రయూనిట్ ఏప్రిల్ ఫూల్ చేయడానికి, సినిమా ప్రమోషన్ కోసం ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చిందని కూడా ప్రచారం జరుగుతోంది.

Telugu April Fool, Nagarjuna, Nagarjuna Nia, Leak, Day, Wild Dog, Wild Dog Pirac

చిత్రయూనిట్ స్పందిస్తే మాత్రమే వైల్డ్ డాగ్ లీకేజ్ కు సంబంధించిన వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది.మరోవైపు నాగార్జున మన్మధుడు2 సినిమా తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాల్సిన బాధ్యత నాగార్జునపై ఉంది.గతంలో ఏ సినిమాకు లేని విధంగా నాగార్జున ఈ సినిమా కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉండటం గమనార్హం.

యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో పాటలు లేవు.

ఆరు పదుల వయస్సులో నాగార్జున కొత్త దర్శకులతో పని చేస్తూ కొత్త పాత్రలను ఎంచుకుంటూ బిజీ కావడం గమనార్హం.నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.

రేపు మధ్యాహ్నం సమయానికి వైల్డ్ డాగ్ సినిమా హిట్టవుతుందో ఫ్లాప్ అవుతుందో తేలనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube