ఇండస్ట్రీకి చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇక్కడ కొంతమంది మాత్రమే హీరోలుగా నిలబడతారు.ఇక తెలుగులో మాత్రం వారసులుగా మొదట ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు కాగా,అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున ( Nagarjuna )స్టార్ హీరోల కొడుకులుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు.
ఇక వీళ్లిద్దరూ కూడా స్టార్ హీరోలుగా ఎదిగారు.ఇక వీళ్ళ జనరేషన్ లో వచ్చిన వారసులు ఎవరు సినిమా ఇండస్ట్రీలో నిలబడలేదు.
ఇదిలా ఉంటే నాగార్జున వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక క్రేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు.

అందులో భాగంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో దమ్మున్న దర్శకుడిగా గుర్తింపు పొందిన పూరి( Puri ) డైరెక్షన్ లో ఆయన సూపర్, శివమణి( Super, Shivamani ) అనే రెండు సినిమాలు చేశాడు.అందులో సూపర్ సినిమా ప్లాప్ అవ్వగా, శివమణి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక మొదటి నుంచి కూడా పూరి కి నాగార్జున కి మంచి అనుబంధం ఉందట.
వీళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ సినిమాల గురించి డిస్కస్ చేసుకుంటారట.ఇక ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ ( Puri Jagannath )ఒక ఇంటర్వ్యూలో నాగార్జున గురించి చెబుతూ నాగార్జున గారు నాకు ఎప్పుడూ ఒక మాట చెప్పే వారిని ఆ మాట ఏంటో చెప్పాడు.
అదేంటంటే మనకి ఎవరైనా కలుస్తే బాగున్నావా, ఏం చేస్తున్నావ్, తిన్నావా అని అడుగుతారు.అంతే తప్ప నువ్వు ఈ రోజు ఎక్సర్సైజ్ చేసావా అని ఎవరు అడగరు.

ఇలాంటి విషయాలు మనకు ఎవరు చెప్పరు మనకు మనమే చేసుకుంటూ పోవాలని నాగార్జున పూరి జగన్నాథ్ కి చెప్పే వారట.అలా తనే దగ్గరుండి పూరిని జిమ్ కి కూడా తీసుకెళ్ళేవాడట… అలా పూరిని వరుసగా వారం రోజులు నాగార్జున జిమ్ కి తీసుకెళ్లాడట.అక్కడ నాగార్జున జిమ్ చేస్తుంటే పూరి మాత్రం అక్కడే కూర్చునేవాడట.దాంతో నాగార్జున కోపానికి వచ్చి నువ్వు తప్పకుండా రోజు ఎక్సర్సైజ్ చేయాలి అని వార్నింగ్ కూడా ఇచ్చాడట.
ఇక ఈ విషయాన్ని పూరి ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు…
.







