రైడ్ చేస్తానంటోన్న నాగ్..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని నాగ్ చూస్తున్నాడు.

 Nagarjuna Wants To Do Raid Movie Remake, Nagarjuna, Raid, Remake, Tollywood News-TeluguStop.com

కాగా ఈ సినిమాను పూర్తి కాప్ థ్రిల్లర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఇందులో నాగ్ ఓ కాప్ పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే నాగార్జున బాలీవుడ్‌లో తెరకెక్కిన ఓ సూపర్ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడు.

బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ నటించిన థ్రిల్లర్ మూవీ ‘రైడ్’ అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది.

ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే తాజాగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు నాగ్ ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాను రీమేక్ చేస్తే తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని ఆయన భావిస్తున్నాడు.ఇక ఈ సినిమా తెలుగు రీమేక్‌ను స్వయంగా ప్రొడ్యూస్ చేసేందుకు నాగ్ రెడీ అయ్యాడు.

అయితే ఈ సినిమాను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించే దర్శకుడి కోసం నాగ్ గాలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ విషయంపై పలువురు డైరెక్టర్లను సంప్రదించాడట కూడా నాగ్.

కానీ ఇంకా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఎవరు ముందుకు రాలేదని తెలుస్తోంది.మరి ఈ సినిమాను నాగ్ కోసం డైరెక్ట్ చేసేందుకు ముందుకు ఎవరు వస్తారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఈ సినిమాకు డైరెక్టర్ దొరక్కగానే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు నాగార్జున రెడీ అవుతున్నాడు.మరి రైడ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే, అది తెలుగు ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

కాగా ప్రస్తుతం వైల్డ్ డాగ్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు అక్కినేని హీరో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube