నాగ్ వెబ్ సిరీస్‌.. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ కథ సిద్దం

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెబ్‌ సిరీస్ లు చేయడం లో తప్పు ఏమీ లేదు.ప్రస్తుతం థియేటర్ల తో పాటు సమానమైన బిజినెస్ ను ఓటీటీ లు చేస్తున్నాయి.

 Nagarjuna Want To Do A Web Series Coming Soon-TeluguStop.com

కనుక ఓటీటీ ల వైపు అడుగులు వేయడం లో తప్పేమి లేదు అన్నట్లుగా ఆయన అభిప్రాయంను వ్యక్తం చేశాడు.వెబ్‌ సిరీస్ ల్లో నటించేందుకు తాను సిద్దం అంటూ ప్రకటించిన నాగార్జున స్వయంగా ఒక ఓటీటీ ని కూడా మొదలు పెట్టే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక యువ దర్శకుడు రెడీ చేసిన కథను నాగ్‌ ఓకే చేశాడట.రొమాంటిక్ ఎంటర్‌ టైనర్ గా సాగే ఆ కథ ను వెబ్‌ సిరీస్ గా చేసేందుకు గాను నాగ్ ప్లాన్ చేస్తున్నాట.

 Nagarjuna Want To Do A Web Series Coming Soon-నాగ్ వెబ్ సిరీస్‌.. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ కథ సిద్దం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన సొంత బ్యానర్‌ లో నాగార్జున దాదాపుగా అయిదు కోట్ల బడ్జెట్‌ తో చేసేందుకు సిద్దంగా ఉన్నాడట.ఈ వెబ్‌ సిరీస్ కు నెట్‌ ఫ్లిక్స్ వారు సహ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు.

నాగార్జున ఇటీవల చేసిన వైల్డ్‌ డాగ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా కమర్షియల్‌ గా నిరాశ పర్చింది.దాంతో ఈసారి పక్కా కమర్షియల్‌ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో సోగ్గాడే చిన్ని నాయన సినిమా సీక్వెల్‌ బంగార్రాజు ను చేయబోతున్నాడు.దాంతో పాటు ప్రవీణ సత్తారు దర్శకత్వం లో ఒక సినిమా ను చేయబోతున్నాడు.

అందులో ఒక రా ఏజెంట్‌ పాత్రలో నాగ్‌ కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా లతో పాటు నాగ్ ఓటీటీ కంటెంట్‌ కూడా ఉంటుందని అంటున్నారు.

నాగార్జున మరియు మరి కొందరు హీరోలు కూడా వెబ్‌ సిరీస్ ల దారి పడుతున్న నేపథ్యం లో ముందు ముందు స్టార్‌ హీరోల వెబ్‌ సిరీస్ లు చూడబోతున్నామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

#Wild Dog #Ott Film #Web Series #Nagarjuna Ott #NagarjunaOtt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు