తన భార్యతో కలిసి తీసిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగ్..!

ప్రముఖ సినిమా హీరో అయిన నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ నవమన్మధుడు.ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న హీరో.

 Nagarjuna Unable To Answer To The Rana Questions In Number One Yaari Show , Nagr-TeluguStop.com

ప్రస్తుతము ఆయన సినిమాల్లో నటించడమే కాకుండా.బుల్లితెర మీద కూడా బిగ్ బాస్ వంటి కార్యక్రమాలకు యాంకర్ గా నిర్వహిస్తూ ప్రేక్షకుల హృదయాలలో ఎంతో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఇటీవల నాగార్జున నటించిన “వైల్డ్ డాగ్” సినిమా ఈ నెల రెండవ తారీకున తెర పైకి రానున్నది.ఈ క్రమంలోనే నాగార్జున ఈ సినిమా ప్రమోషన్ లను భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆహా యాప్ ద్వారా రానా వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న నెంబర్ 1 యారి అనే కార్యక్రమానికి నాగార్జున, వైల్డ్ డాగ్ కథానాయకతో కలసి ఈ కార్యక్రమము నిర్వహించారు.

నంబర్ 1 యారి ప్రోగ్రాం ద్వారా రానా అడిగిన పలు ప్రశ్నలకు నాగార్జున సమాధానాలు చెప్పాడు.

అయితే.రానా ఏ ప్రశ్నలు అడిగాడు అన్న విషయానికి వస్తే.

బాలనటుడిగా మీరు ఎన్ని చిత్రాలు చేశారు.? అని అడగగా అందుకు నాగార్జున తాను సుడిగుండాలు అనే సమాధానం చెప్పారు.అలాగే అమలా గారితో ఎన్ని చిత్రాలు నటించారు.? సయామీ నటించిన తెలుగు మొదటి సినిమా ఏది.? అనే ప్రశ్నలు అడగగా అందుకు నాగార్జున గారు ఏమీ సమాధానము చెప్పలేక నవ్వులు పంచారు.ఆయన ప్రశ్నలకు సమాధానాలు తెలిసి చెప్పలేదా లేకపోతే తెలియక చెప్పలేదా ఎవరికీ అర్థం కావడం లేదు.

ప్రస్తుతము ఈ కార్యక్రమం కు సంబంధించిన ప్రోమోను మాత్రమే విడుదల చేశారు.ఈ కార్యక్రమము పూర్తి ఎపిసోడ్ చూడాలంటే వచ్చే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.ఈ మధ్య ఎన్నో రోజుల నుంచి నాగార్జున సినిమాలు లేక పోవడము మన గమనిస్తున్నాను.ఇప్పుడు విడుదల కాబోతున్న వైల్డ్ డాగ్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అని నెటిజన్లు అంటున్నారు.

చూడాలి మరి వైల్డ్ డాగ్ సినిమా హిట్ అయ్యేది లేనిది.

Telugu Aha App, Amala, Nagrjuna, Yaari Show, Number Yari, Programee, Rana, Lates .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube