ఆఫీసర్‌ బాధ్యతలు నెత్తికెత్తుకున్న నాగ్‌       2018-05-23   06:48:17  IST  Raghu V

ఒక సినిమాలో నటించిన హీరో ఆ సినిమాకు సంబంధించిన ప్రోమోషన్‌ విషయాల్లో తప్ప బిజినెస్‌ వ్యవహారాల్లో, విడుదలకు సంబంధించిన విషయాల్లో తలదూర్చరు. స్టార్‌ హీరోలు కూడా తమ పని ఏదో తాము చేసుకున్నాం అన్నట్లుగా వ్యవహరిస్తారు. సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా కూడా హీరోలు బాధ్యతను స్వీకరించరు. కాని తాజాగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆఫీసర్‌’ చిత్రం కోసం నాగార్జున ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. సినిమా విడుదలకు చిక్కు నెలకొన్న నేపథ్యంలో ఆయన ముందుండి ఆ సమస్యల నుండి బయట పడేసేందుకు తన వంతు సాయం చేశాడు.

వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఆఫీసర్‌’ చిత్రం విడుదలకు ముంబయి హైకోర్టు సే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విడుదల చేయవద్దంటూ వర్మను ఆదేశించింది. ఒక డిస్ట్రిబ్యూటర్‌ తమకు రావాల్సిన మొత్తంను వర్మ చెల్లించడం లేదంటూ కేసు వేయడంతో పై విధంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ మొత్తంను ప్రస్తుతం వర్మ తీర్చే పరిస్థితిలో లేడు. సినిమా విడుదలైతే కాని ఆ డబ్బు ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో నాగార్జున ముందుకు వచ్చి ఆ మొత్తంను చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆ డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడి, చెల్లించాల్సిన మొత్తం ఇచ్చేసి, ఆ తర్వాత కోర్టు నుండి క్లీయరెన్స్‌ను తెప్పించాడు.

నాగార్జున సహకారంతో ‘ఆఫీసర్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంపై నాగార్జునకు ఆశలు, అంచనాలున్నాయి. వర్మతో గతంలో చేసిన సినిమాలు సక్సెస్‌ను దక్కించుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఆయన కలిగి ఉన్నాడు. అందుకే విడుదలకు ఆఫీసర్‌ ఇబ్బందు పడుతున్న సమయంలో స్వయంగా రంగంలోకి దిగి సెటిల్‌ చేయడం జరిగింది. సినిమా విడుదల తర్వాత ఆ డబ్బును వర్మ నుండి రికవరీ చేసుకోబోతున్నాడు. సినిమా ఫ్లాప్‌ అయినా కూడా నాగ్‌ పెట్టిన డబ్బులు సునాయాసంగా వస్తాయనే నమ్మకం ఆయనకు ఉంది
.

వివాదాల దర్శకుడు వర్మ ‘ఆఫీసర్‌’ను మొదలు పెట్టినప్పుడు అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని చేస్తూ ఉన్నాను అంటూ ప్రకటిస్తూ వచ్చాయి. అయితే సినిమా విడుద సమయం వరకు మెగా ఫ్యామిలీతో విభేదాలు పెట్టుకుని చివరకు సినిమా విడుదల కష్టం అయ్యే పరిస్థితికి వర్మ తీసుకు వచ్చాడు. నాగార్జున సహకారంతో ఎట్టకేలకు ‘ఆఫీసర్‌’ జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. వర్మను నమ్మినందుకు నాగార్జునకు ఎలాంటి ఫలితం దక్కింది అనేది తెలియాలి అంటే జూన్‌ 1 వరకు ఆగాల్సిందే.