కపిల్ దేవ్‌ను పట్టుకొస్తున్న నాగ్  

Nagarjuna To Present Kapil Dev Biopic-kapil Dev Biopic,nagarjuna,telugu Movie News,vishnu Induri

ప్రస్తుతం బయోపిక్‌ సినిమాలు ఎలాంటి సెన్సేషన్‌లు క్రియేట్ చేస్తున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ సినిమాలకు జనాలు నీరాజనాలు పడుతున్నారు.ఇలాంటి చిత్రాలు కేవలం విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో దర్శకనిర్మాతలు ఇలాంటి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.కాగా బాలీవుడ్‌లో మరో క్రీడాకారుడి జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Nagarjuna To Present Kapil Dev Biopic-Kapil Biopic Nagarjuna Telugu Movie News Vishnu Induri

భారత క్రికెట్ జట్టుకు తొలి ప్రపంచకప్‌ను అందించిన లెజెండరీ క్రికెటర్‌ కపిల్ దేవ్ బయోపిక్‌ను బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను కబీర్ ఖాన్ డైరెక్ట్ చేస్తుండగా విష్ణు ఇందూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమాను హిందీతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.అయితే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ ముందుకొచ్చింది.

ఈ మేరకు అక్కినేని నాగార్జునను చిత్ర యూనిట్ కలిసింది.దీపికా పదుకొనే లాంటి స్టార్ బ్యూటీ ఈ సినిమాలో నటిస్తోండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు.ధోనీ బయోపిక్ బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు కపిల్ దేవ్ కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.మరి నాగ్‌కు కపిల్ దేవ్ ఎలాంటి లాభాలను తెచ్చిపెడతాడో చూడాలి.

తాజా వార్తలు

Nagarjuna To Present Kapil Dev Biopic-kapil Dev Biopic,nagarjuna,telugu Movie News,vishnu Induri Related....