వైల్డ్ డాగ్ కోసం మనాలీ వెళ్లిన నాగార్జున

టాలీవుడ్ కింగ్, స్టార్ హీరో నాగార్జున ప్రస్తుతం రొటీన్ కమర్షియల్ చిత్రాల జోలికి వెళ్లకుండా కంటెంట్ బేస్ ఉన్న కథలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.ఒక్క బంగార్రాజు సినిమా తర్వాత నెక్స్ట్ కమర్షియల్ సినిమాల సంఖ్య వీలైనంత తగ్గించుకోవాలని అనుకుంటున్నాడు.

 Nagarjuna To Head To Kulu Manali For Wild Dog, Tollywood, Telugu Cinema, After L-TeluguStop.com

కొత్త కథల కోసం అవసరమైతే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు.ఈ నేపధ్యంలో అహిషోర్ సోలొమన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు.

యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కి ముందే స్టార్ట్ అయినా అనంతరం వాయిదా పడింది.

మరల ప్రస్తుతం సడలింపులు ఇవ్వడంతో షూటింగ్ స్టార్ట్ చేశాడు.ప్రస్తుతం టాలీవుడ్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిన సీనియర్ హీరోల జాబితాలో ముందు వరుసలో నాగార్జున ఉన్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా షెడ్యూల్ నిర్విరామంగా సాగుతుంది.ఇప్పటికే హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసిన నాగార్జున నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఈ సినిమా చిత్రీకరణ కోసం మనాలీ వెళ్ళిపోయాడు.ప్రస్తుతం అక్కడ షూటింగ్ జరుగుతుంది.20 రోజుల పాటు మనాలీ షెడ్యూల్‌ జరగనుందని సమాచారం.ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఇదిలా ఉంటే ఓ వైపు వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ చేస్తూనే నాగార్జున వారాంతంలో ఒక రోజు వచ్చి బిగ్ బాస్ ఎపిసోడ్స్ పూర్తి చేసి వెళ్ళిపోతున్నాడు.

గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని చిత్ర యూనిట్ అనుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube