నాగార్జునకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ !

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.నాగార్జున కొడుకులు కూడా హిట్ కొట్టడానికి నానాపాట్లు పడుతుంటే ఈయన మాత్రం మంచి హిట్స్ అందుకుని దూసుకు పోతున్నాడు.

 Nagarjuna To Act With Sonakshi Sinha-TeluguStop.com

ఈ మధ్యే ఆయన నటించిన ‘వైల్డ్ డాగ్‘ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అందుకుంది.థియేటర్ లోనే కాదు ఓటిటీ లో కూడా సత్తా చాటుకుంది.

తీవ్రవాదం ఎన్ ఐ ఏ ఆపరేషన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.ఈ సినిమాలో నాగార్జున, దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు.

 Nagarjuna To Act With Sonakshi Sinha-నాగార్జునకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ -Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆశిషోర్ సోలమన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.నాగార్జున ఈ సినిమా హిట్ తర్వాత అదే జోష్ తో మరొక సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.

నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనఎంత హిట్ అయ్యిందో తెలిసిందే.ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ఒక సినిమా రాబోతుంది.ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేసాడు.అందులో బంగార్రాజు పాత్ర ఒకటి.

ఇప్పుడు అదే పేరుతో నాగార్జున ఒక సినిమా చేయబోతున్నాడు.సోగ్గాడే చిన్ని నాయన సినిమా వచ్చిన సమయంలోనే ఈ సినిమాను ప్రకటించారు.

Telugu Bangarraju Movie, Nagarjuna, Nagarjuna To Act With Sonakshi Sinha, Sonakshi Sinha-Latest News - Telugu

కానీ మధ్యలో కొన్ని కారణాల కారణంగా అప్పటి నుండి ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమాను జులై లో సెట్స్ మీదకు తీసుకువెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నాడు.ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ను సెలెక్ట్ చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం సోనాక్షి తో ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది.

ఈ విషయం నిజమైతే స్క్రీన్ పై ఒక కొత్త జోడీ ను చూడవచ్చు.

#NagarjunaTo #Sonakshi Sinha #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు