యాత్ర 2లో వైఎస్ జగన్ గా కింగ్ నాగార్జున

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని కీలకమైన తన రాజకీయ ప్రయాణం, పాదయాత్ర ఎలిమెంట్ తో మహి వి రాఘవ దర్శకత్వంలో యాత్ర సినిమా వచ్చింది.మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించి మెప్పించాడు.

 Nagarjuna To Act As Ys Jagan, Yatra 2, Tollywood, Ys Jagan Biopic, Director Mahi-TeluguStop.com

ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు వైఎస్ జగన్ కి కూడా ఎన్నికల ముందు రాజకీయంగా భాగా ఉపయోగపడింది.ఈ సినిమాలోని నేను విన్నాను, నేను ఉన్నాను అనే డైలాగ్ తో జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రజలని ఆకట్టుకున్నాడు.

తండ్రి బాటలోనే జగన్ కూడా సుదీర్ఘ పాత్ర యాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని అద్భుతమైన విజయంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.అంతకంటే ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం జగన్ రాజకీయంగా అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, అవినీతి ఆరోపణలతో 16 నెలలు జైలు జీవితం అనుభవించారు.

తరువాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకి వచ్చి పార్టీ పెట్టి ప్రజలలోకి వెళ్ళారు. వైఎస్ జగన్ కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే జగన్ జీవితంలో జరిగిన పొలిటికల్ డ్రామా, నాయకుడుగా ఎదిగిన విధానం, పార్టీ పెట్టి, ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా వెళ్లి అధికారం సొంతం చేసుకున్న ఎలిమెంట్స్ తో ఇప్పుడు యాత్ర సీక్వెల్ గా యాత్ర 2 తెరకెక్కిస్తానని దర్శకుడు మహి వి రాఘవ గతంలో చెప్పారు.ఇప్పుడు ఆ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో జగన్ పాత్ర కోసం కింగ్ నాగార్జునని డైరెక్టర్ మహి సంప్రదించారని, అతను కూడా చేయడానికి అంగీకరించారని తెలుస్తుంది.అయితే ఈ విషయంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు.

నాగార్జున ఈ సినిమాలో నటిస్తే ఆయన కెరియర్ లో చేస్తున్న మొట్టమొదటి పొలిటికల్ డ్రామా మూవీ ఇదే అవుతుంది.మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube