ప్రియాకు కోపం వచ్చింది.. సన్నీ, కాజల్ కు చుక్కలు?

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం కెప్టెన్సీ కోసం బంగారు కోడిపెట్ట టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ టాస్క్ లో భాగంగా కోడిగుడ్లను ఎవరు ఎక్కువగా పొందితే వారు విజేతగా బిగ్ బాస్ ప్రకటించడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఇతరుల గుడ్లను దొంగలించడం తో గొడవలు చోటుచేసుకుంటున్నాయి.

 Nagarjuna Telugu Bigg Boss 5 Written Updates Discussion Between Sunny And Priya-TeluguStop.com

ఈ క్రమంలోనే విశ్వ ఒక ఎల్లో ఎగ్ పొందాడు.ఈ ఎగ్ పొందడంతో ఐదు గుడ్లను పొందే అవకాశాన్ని విశ్వ, కాజల్ కి ఇచ్చాడు.

అయితే ఈ ఐదు గుడ్లను పొందాలంటే వారి ఒంటిపై ఎవరైతే ఎక్కువ దుస్తులు ధరిస్తారో వారికి ఐదు గుడ్లను పొందే అవకాశాన్ని కల్పించారు.

ఈ క్రమంలోనే విశ్వ కాజల్ దుస్తులపై దుస్తులను ధరించడానికి పోటీపడ్డారు.

ఈ టాస్క్ లో భాగంగా కాజల్ కి సన్నీ చుక్కలు చూపించాడు.తనకు సపోర్ట్ చేస్తూనే వాష్ రూమ్ దగ్గర ఆరేసిన అండర్వేర్ లన్నింటిని ఎత్తుకొచ్చి తనని వేసుకోమని చెప్పాడు.

ఈ సమయంలో సభ్యుల మధ్య కాస్త ఫన్నీ ఇన్సిడెంట్ లు జరిగాయి.ఇలా సన్నీ కాజల్ కు సపోర్ట్ చేస్తూ ఈ టాస్క్ ఆడారు.

ఇలా సన్నీ తనకు బట్టలు తీసుకు వస్తున్న క్రమంలో ప్రియ ఏంటి చండాలంగా అంటూ కోపం తెచ్చుకుంది.చివరికి ఈ టాస్క్ లో విశ్వా 106 బట్టలు వేసుకోగా, కాజల్ 76 వేసుకోవడంతో విశ్వవిజేతగా నిలిచిన తనకు 5 గుడ్లు బోనస్ గా లభించాయి.

Telugu Bigg Boss, Captaincy Task, Kajal, Nagarjuna, Priya, Sunny Priya, Tollywoo

ఇక ఆ బంగారు కోడిపెట్ట టాస్క్ లో భాగంగా సన్ని గుడ్లపై ప్రియా కన్నేసింది.తాను సంపాదించిన కోడిగుడ్లను తాను దొంగతనం చేశానని పిచ్చి పట్టినదానిలాగా ప్రవర్తిస్తోంది.ఈ క్రమంలోనే సన్నీ గుడ్లను దొంగతనం చేయడానికి వెళ్లడంతో సన్నీ వాటిని ప్రొటెక్ట్ చేస్తూ తనని పక్కకు తోసాడు.ఈ క్రమంలోనే ఫ్లవర్ వాస్ తో సన్నీని కొట్టబోయిన ప్రియ తనని గిచ్చింది.

అలాగే నువ్వు ఫిజికల్ అయితే మర్యాదగా ఉండదు అని హెచ్చరించడమే కాకుండా తన చెంప పగలగొడతా అంటూ సన్నీకి వార్నింగ్ ఇచ్చింది.దీంతో సన్నీ నువ్ ఫిజికల్ అయితే మర్యాదగా ఉండదు అని హెచ్చరించింది.

ఇలా సన్నీ గుడ్లను సిరి దొంగతనం చేయడంతో వీరిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది అలాగే సన్నీ జెస్సి గుడ్లను దొంగతనం చేయగా సన్నీకి జెస్సి కి మధ్య గొడవ ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube