కాజల్ ని నాగిని అన్నది అందుకే.. ఒక్క నిర్ణయం రెండు విధాలుగా?

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో 75 వ రోజు రసవత్తరంగా సాగింది.కాజల్ ఆడిన ఆటను చూసి మానస్ షాక్ అయ్యాడు.

 Kajal, Sunny, Manas, Bigg Boss Telugu 5,latest News-TeluguStop.com

ఆమె రెండు నాలుకల ధోరణిని చూసి బ్లాక్ అయ్యాడు.రింగ్ ఈజ్ కింగ్ అనే కెప్టెన్సీ టాస్క్ లో మానస్ గెలిచి, ఇంటి కెప్టెన్ గా మారాడు.

రింగును చివరి వరకు పట్టుకొని మానస్ ఉన్నాడు.మొదట యాని మాస్టర్, తరువాత సిరి కిందపడిపోయారు.

చివర్లో ప్రియాంక తన రెండో చేతిని ఉపయోగించడంతో మానస్ టాస్క్ లో గెలిచాడు.

కెప్టెన్ అయిన తర్వాత మానస్, సన్నీ కాజల్ దగ్గరకు వచ్చాడు.

ఏ డిపార్ట్మెంట్ కావాలి ఏ పని చేస్తావు అని కాజల్ ని మానస్ అడుగగా, ఏది చెప్తే అది చేస్తాను అని కాజల్ అంటుంది.సారి చెప్పు అని మానస్ ను కాజల్ అడగడంతో.

సోది మొహం దాన అని అన్నావు కదా సారీ చెప్పు అని కాజల్ అడుగుతుంది.మానస్ సారీ చెప్పడంతో ఇద్దరు హగ్ చేసుకున్నారు.

చివరకు సన్నీ జాయిన్ అయ్యాడు.సన్నీ అయితే ఏకంగా మానస్ కు ముద్దులు పెట్టేశాడు.

మానస్ కూడా తిరిగి ముద్దులు పెట్టాడు.ఏరా పెదవుల మీద ముద్దు పెడతావా నేను ఇంకా వర్జిన్ రా ఇంతవరకు ఎవరికీ పెట్టలేదు అని అనడంతో కాజల్ షాక్ అయి చూసింది.

ఇది నిజం నన్ను నమ్ము అని అంటాడు.

Telugu Kajal, Manas, Sunny-Movie

ఆ తరువాత ఎవిక్షన్ ప్రీ ప్రాస్ గురించి టాస్క్ మొదలైంది.ఈ క్రమంలోనే మానస్, కాజల్ ఆడతారు.వీరిద్దరి మధ్యలో ఒకే అభిప్రాయం రాకపోయేసరికి సన్నీ నే కాజల్ దారిలోకి వస్తాడు.

సన్నీ, కాజల్ కు ఆని మాస్టర్, సిరిలో నుంచి ఒకరిని కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది.అప్పుడు మానస్ నాకు ఆనీ మాస్టర్ సేవ్ చేయాలని ఉందని అంటాడు.

అప్పుడు కాజల్ సిరిని సేవ్ చేస్తాను అని అనడంతో సరే ఓకే నేను కూడా సిరిని సపోర్ట్ చేస్తాను అని అంటాడు.అప్పుడు వెంటనే కాజల్ నేను యాని మాస్టర్ కి సపోర్ట్ చేస్తాను అని అంటుంది.

అదేంటి ఇంతకుముందు సిరి అన్నావు కదా అని మానస్ అడగగా అవును.ఇప్పుడు యాని మాస్టర్ అంటున్నాను అనేసింది కాజల్.కాజల్ ఆడిన ఆటను చూసి మానస్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.ఇలా కాజల్ రెండు విధాలుగా మాట్లాడటంతో ఆమెను అని మాస్టర్ నాగిని అని పిలిచారు ఏమో అంటూ పలువురు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube