బిగ్‌బాస్ హౌస్‌లోకి మ‌రో హాట్ హీరోయిన్‌... !

తెలుగు బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రారంభ‌మ‌య్యేందుకు మ‌రో రెండు రోజుల టైం మాత్ర‌మే మిగిలి ఉంది.హోస్ట్ కింగ్ నాగార్జున వ‌దిలిన ప్ర‌మోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

 Another Hot Heroine In Bigg Boss 4,bigg Boss 4,nagarjuna,contestant List,swati D-TeluguStop.com

ఇప్ప‌టికే కంటెస్టెంట్లు అంద‌రూ ఫైన‌లైజ్ అయ్యి హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్లో క్వారంటైన్‌లో ఉన్నార‌ని అంటున్నారు.ఇక మ‌రో మూడు రోజుల్లోనే షో ప్రారంభం కానుండ‌డంతో కంటెస్టెంట్ల‌పై క్ర‌మ‌క్ర‌మంగా క్లారిటీ వ‌స్తోంది.

మొత్తం 15 మంది కంటెస్టెంట్ల‌తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మ‌రో ముగ్గురు కంటెస్టెంట్లు ఉంటార‌ని.106 రోజుల పాటు కొన‌సాగే ఈ ప్రోగ్రామ్‌ను ఈ సారి గ‌తంతో పోలిస్తే మ‌రింత ర‌క్తిక‌ట్టించేలా టాస్క్‌లు సెట్ చేశార‌ట‌.ఇప్ప‌టికే ఈ షోలో ఓ హీరోయిన్ క‌న్‌ఫార్మ్ కాగా ఇప్పుడు మ‌రో హాట్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంద‌న్న న్యూస్ క‌న్‌ఫార్మ్ అయ్యింది.హౌస్‌లోకి అల్ల‌రి న‌రేష్ ప‌క్క‌న కొన్ని సినిమాల్లో న‌టించిన మోనాల్ గ‌జ్జ‌ర్ ఇప్ప‌టికే ఓ కంటెస్టెంట్‌గా ఎంపిక‌వ్వ‌గా ఇప్పుడు మ‌రో హాట్ తార స్వాతి దీక్షిత్ కూడా హౌస్‌లో ఉంటుంద‌ని తెలిసింది.

Telugu Bigg Boss, China, Contestant List, Corona, Lock, Nagarjuna, Swati Deekshi

సాహో ద‌ర్శ‌కుడు సుజీత్ తెర‌కెక్కించిన కొన్ని షార్ట్ ఫిల్మ్‌ల‌తో పాటు కొన్ని టీవీ షోలు, సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన స్వాతికి హాట్ ఇమేజ్ బాగానే ఉంది. ఇక సుజీత్ సినిమాల్లోకి రాక‌ముందు ఓన్‌గా చాలా షార్ట్ ఫిల్మ్‌లు చేశాడు.వాటిల్లో స్వాతినే ఎక్కువుగా న‌టించింది.ఈ క్ర‌మంలోనే సుజీత్‌కు, స్వాతికి మంచి స్నేహం కూడా ఉంది.ఆ త‌ర్వాత స్వాతి అల్ల‌రి న‌రేష్ జంప్ జ‌లానీ, బ్రేక్ అప్‌, లేడీస్ & జెంటిల్మెన్, ఆర్జీవి యొక్క పట్ట‌ పగలు, అంజలి చిత్రాంగ‌ద సినిమాల్లో కూడా న‌టించింది.మ‌రి ఇప్పుడు ఇద్ద‌రు హాట్ హీరోయిన్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటే ప్రేక్ష‌కుల‌కు ఎంత కనుల విందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube