అవినాష్ కు ఊహించని గిఫ్ట్ పంపిన నాగార్జున..!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలేకు వారం రోజులు మాత్రమే ఉంది.రేపు బిగ్ బాస్ హౌస్ నుంచి మోనాల్ లేదా హారిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండగా అభిజిత్ లేదా సోహైల్ బిగ్ బాస్ విన్నర్ కావచ్చని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Nagarjuna Suprise Gift To Bigg Boss Contestant Avinsh, Avinash, Big Boss4, Nagar-TeluguStop.com

రోజురోజుకు టాస్కుల్లో కఠినత్వం పెరుగుతూ ఉండటంతో ప్రేక్షకుల్లో సైతం కంటెస్టెంట్లపై అభిప్రాయాలు మారుతున్నాయి.

అయితే బిగ్ బాస్ సీజన్ 4లో గత వారం జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ షోలో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించిన అవినాష్ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యారు.అయితే ఎలిమినేట్ అయిన అవినాష్ కు నాగార్జున సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

వీకెండ్ ఎపిసోడ్లలో నాగార్జున అవినాష్ పేరునే ఎక్కువగా చెప్పేవారు.అవినాష్ తో కామెడీ చేయించి నాగార్జున వీకెండ్ షోలలో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించేవారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తరువాత వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న అవినాష్ కు నాగార్జున షర్ట్ ను గిఫ్ట్ గా పంపించారు.వీకెండ్ ఎపిసోడ్ లో అవినాష్ నాగార్జున వేసుకున్న షర్ట్ బాగుందని చెప్పగా ఆ షర్ట్ ను నాగార్జున పంపించడంతో అవినాష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఆ షర్ట్ లో ఫోటో దిగి సోషల్ మీడియా వేదికగా అవినాష్ ఫోటోను షేర్ చేశారు.

అవినాష్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షర్ట్ బాగుందని చెబితే నాగార్జున గారు గుర్తు పెట్టుకొని మరీ ఇంటికి పంపించారని పేర్కొన్నారు.

అవినాష్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో జబర్దస్త్ షో నిర్వహకుల గురించి నెగిటివ్ కామెంట్లు చేసిన అవినాష్ మళ్లీ ఆ షోలోకి వెళతాడో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube