మన్మధుడిని చూస్తే ఇక అంతే అదరగొట్టేసాడు

కింగ్ నాగార్జున నటించిన ‘మన్మధుడు’ చిత్రం గుర్తు ఉండే ఉంటుంది.ఎప్పుడో 16 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో అతిపెద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా టాలీవుడ్ లో ఒక మన్మధుడి గా నిలిచిపోయాడు.

 Nagarjuna Stunnign Look In Manamadudu Movie Sequel-TeluguStop.com

అయితే ఇన్ని సంవత్సారాల తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.అందులోనూ ఈ మన్మధుడి పక్కన రకుల్,కీర్తి సురేష్ లు వంటి బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తుండడం తో ఈ చిత్రం పై మరింత ఆసక్తి పెరిగిపోయింది.

అయితే ఇప్పుడు తాజాగా నాగార్జున కు సంబందించిన కొన్ని స్టిల్స్ బయటకొచ్చాయి.అయితే ఆ స్టిల్స్ లో కింగ్ నాగార్జున ను చూస్తుంటే మళ్లీ 20 ఏళ్ల కుర్రాడిగా తయారయ్యాడు.

నిజంగా ఆ స్టిల్స్ లో నాగ్ లుక్స్ అలానే ఉన్నాయి.చాలా తగ్గిపోయి చిన్న కుర్రాడిలా మారిపోయాడు.

నిజంగా ఆస్టిల్స్ ని చూస్తే ఆయనకు 60 ఎల్లా వయసు అన్న విషయం ఎవరికీ కూడా గుర్తుకు రాదు.మొన్నటివరకు కొంచం బొద్దుగా ఉన్న నాగార్జున మన్మధుడు-2 కోసం బాగా బరువు తగ్గిపోయినట్లు తెలుస్తుంది.

మన్మధుడిని చూస్తే ఇక అంతే అదర

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 40 శాతం పూర్తి అయిపొయింది.ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జ‌రుగుతుంది.అస‌లు ఉన్న‌ట్లుండి ఇంత బ‌క్క‌గా మారిపోయిన నాగార్జున‌ను చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.ఇందులో ర‌కుల్, కీర్తి సురేష్, స‌మంత హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా,ఆర్ఎక్స్ 100 ఫేమ్ చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థతో పాటే బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ వయాకమ్ 18 ఇందులో భాగస్వామిగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube