బిగ్‌ బాస్‌ 4 ప్రసార తేదీ లాక్‌

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం జనాలు కరోనాతో భయాందోళనకు గురి అవుతున్న సమయంలో బిగ్‌బాస్‌ సాధ్యమా అనుకుంటూ ఉండగా ఇప్పటికే స్టార్‌ మా వారు బిగ్‌బాస్‌ సీజన్‌ 4ను ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు.

 Big Boss 4 Telecast Date Fix, Big Boss 4, Nagarjuna, Star Maa, Coronavirus, Big-TeluguStop.com

తెలుగులో గత మూడు సీజన్‌లు మంచి సక్సెస్‌ అయ్యాయి.కనుక ఈ నాల్గవ సీజన్‌ను విపత్తు సమయంలో కూడా మొదలు పెట్టేందుకు మేకర్‌ సిద్దం అయ్యారు.

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్న ఈ సీజన్‌కు సంబంధించిన ప్రసార తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది.

ఆగస్టు 30వ తారీకు ఆదివారం నుండి ఈ షో ప్రసారం కాబోతుంది.30వ తారీకు ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపించి సోమవారం నుండి షోను ప్రారంభిస్తారు.అంటే 29వ తారీకునే షూటింగ్‌ జరుగుతుంది.

రెండు ఎపిసోడ్స్‌కు సంబంధించి కంటెస్టెంట్స్‌ ఎంట్రీ ఉంటుంది.ఈసారి చాలా విభిన్నంగా బిగ్‌బాస్‌ను ప్లాన్‌ చేస్తున్నారు.

అన్ని విధాలుగా భారీ ప్రచారం నిర్వహించడంతో పాటు కంటెస్టెంట్స్‌ విషయంలో చాలా చాలా చర్చలు జరిపి చివరకు మంచి వారిని ఎంపిక చేసి చివరకు మంచి కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

వంద రోజులు అంటూ మొదట ప్రచారం చేస్తారు.

కాని షోను పరిస్థితిని బట్టి వచ్చే రేటింగ్‌ను బట్టి 120 నుండి 130 రోజుల వరకు కూడా పొడగించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.ప్రస్తుతం షోకు సంబంధించిన తుది రూపు ఇస్తున్నారు.

కరోనా నేపథ్యంలో భారీ ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షోను నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం నిర్వాహకులు కూడా కరోనాకు సంబంధించి కంటెస్టెంట్స్‌ను పరీక్షలు చేయడంతో పాటు వారిని కనీసం పది రోజుల ముందు నుండి తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube