నాగచైతన్య ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

అక్కినేని నాగార్జున తనయుడు, యంగ్ హీరో నాగచైతన్య జోష్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ మొదలుపెట్టి వరుస విజయాలతో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.నాగచైతన్య కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం ఉన్నాయి.

 Nagarjuna Son Nagachaitanya Wealth Details, 40 Crores Rupees, Nagarjuna Son Naga-TeluguStop.com

ఏ మాయ చేశావె, 100 % లవ్, తడాఖా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మనం, మజిలీ హిట్లతో మిడిల్ రేంజ్ హీరోల్లో చైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

మూడేళ్ల క్రితం స్టార్ హీరోయిన్ సమంత చైతన్యప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

అయితే నాగచైతన్య కేవలం సినిమాల ద్వారా దాదాపు 40 కోట్ల రూపాయలు సంపాదించారని సమాచారం.చైతన్య సినిమాల్లో హీరోగా నటించడంతో ప్రలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

పదేళ్ల సినీ కెరీర్ లో చైతన్య విజయాలను అందుకుంటూ భారీ మొత్తమే సంపాదించారు.

Telugu Crore Rupees, Nagarjunason, Samantha, Wealth-Movie

నాగార్జున నుంచి వచ్చే ఆస్తులు కూడా కలిపితే చైతన్యకు వందల కోట్లు ఉన్నట్లుగానే భావించాలి.మరోవైపు చైతన్య కెరీర్ తొలినాళ్ల నుంచి తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటూ సినిమాసినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటున్నారు.కెరీర్ తొలినాళ్లలో మాస్ సినిమాలు చేసిన చైతన్య ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోవడంతో క్లాస్ సినిమాలకే ప్రాధాన్యతనిస్తున్నారు.

నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోర్ సినిమాలో, విక్రమ్ కె కుమార్ థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్నారు.లవ్ స్టోరీ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయిపల్లవి నటిస్తుండగా థ్యాంక్యూ సినిమాలో చైతన్యకు జోడీగా రష్మిక నటిస్తున్నారు.అయితే సినిమాల ద్వారా నాగచైతన్య 40 కోట్లు సంపాదించగా సమంత మాత్రం చైతన్య కంటే రెట్టింపు సంపాదించినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube