హుస్సేన్‌ సాగర్‌ ను ఆనుకుని అక్కినేని వారికి అయిదు ఎకరాలు

టాలీవుడ్ ఒకప్పుడు తమిళనాడులోని చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే.ఆ సమయంలో చిత్రంగా పరిశ్రమ పలు ఇబ్బందులను ఎదుర్కొంది.

 Nagarjuna Shares Childhood Memories, 5acres Land, Hyderabad, Annapurna Studios,-TeluguStop.com

హైదరాబాదు అభివృద్ధి అవుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమను ఇక్కడికి తీసుకు వస్తే బాగుంటుందని పలువురు భావించారు.అందులో ముఖ్యంగా అప్పటికి స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్ ఏఎన్నార్ మరియు ముఖ్యులు ఉన్నారు.

అనుకున్నదే తడవుగా అక్కినేని వారు కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చారు.సినిమా పరిశ్రమ వస్తుందా రాదా అనే అనుమానం ఉన్నా కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉండాలని ఫిక్స్ అయ్యారు.1960లలో ఆయన హుస్సేన్ సాగర్ కి ఆనుకుని ఉన్న ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు.ఎనిమిది ఎకరాల భూమిలో కొంత మేరకు ఇల్లు నిర్మించుకుని మిగిలిన భాగంలో ఇతర కూరగాయల పంటలను వేసే వాళ్ళు.

అక్కడే ఒక పశువుల షెడ్డు నిర్మించారు.ఒక చోట చేపల చెరువు ని కూడా నిర్మించారు.

ఆ ఎనిమిది ఎకరాల లో భారీగా వ్యవసాయమును నాగేశ్వరరావు గారు చేయించారట.ఈ విషయాన్ని తాజాగా నాగార్జున ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.తనకు చిన్నతనం నుండే వ్యవసాయంపై అవగాహన ఉందని ఆవుల పాలు పిండడం తో పాటు వాటిని కడిగినా అంటూ చెప్పుకొచ్చారు.చిన్నప్పుడే తనకు సొంత పొలంలో పండిన కూరగాయలు తినడం అలవాటు అయిందని అన్నారు.

హుస్సేన్‌ సాగర్ ని ఆనుకుని అప్పట్లో తమ భూమి ఉండేదని పేర్కొన్నాడు.కాలక్రమేణా హుస్సేన్ సాగర్ చుట్టూ పెద్ద పెద్ద భవనాలు షాపింగ్ కాంప్లెక్స్ లు అయ్యాయి.

ఇప్పుడు అంత భూమి హుస్సేన్‌ సాగర్ పక్కన ఉంటే వేల కోట్ల సంపద అనడంలో సందేహం లేదు.అక్కడి నుండి వచ్చి ఏఎన్నార్ గారు అన్నపూర్ణ స్టూడియో ను నిర్మించారు.

అన్నపూర్ణ స్టూడియో కూడా హైదరాబాదులో ప్రముఖంగా పేరు దక్కించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube