నాగ్ కొత్త సినిమాకు డైరెక్టర్ ఆయనేనా?  

Nagarjuna Sekhar Kammula Love Story - Telugu Love Story, Nagarjuna, Sekhar Kammula, Wild Dog

కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు.భారీ అంచనాలు పెట్టుకున్న ‘మన్మధుడు 2’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆయన తన నెక్ట్స్ చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు.

 Nagarjuna Sekhar Kammula Love Story

కాగా ప్రస్తుతం కాప్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో నటిస్తున్న నాగ్, ఇప్పుడు మరో సినిమాను ఓకే చేయడానికి రెడీ అవుతున్నాడు.టాలీవుడ్‌లో సెన్సిబుల్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు నాగ్ సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ‘లవ్‌స్టోరీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు.ఈ సినిమా తరువాత మరోసారి తనదైన స్టయిల్‌లో ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేసేందుకు రెడీ అవుతున్నాడు శేఖర్ కమ్ముల.

నాగ్ కొత్త సినిమాకు డైరెక్టర్ ఆయనేనా-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు లవ్‌స్టోరీ చిత్ర నిర్మాతలు ఇప్పటికే ఓకే చెప్పారు.కాగా నాగ్‌ను ఈ సినిమాలో హీరోగా తీసుకోవడానిక సదరు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

అంటే శేఖర్ కమ్ముల నెక్ట్స్ మూవీలో నటించేది నాగ్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్ర్కిప్టును పూర్తి చేసే పనిలో ప్డడాడు శేఖర్ కమ్ముల.కాగా లవ్‌స్టోరీ చిత్రంతో మరోసారి ఫిదా లాంటి సక్సెస్‌ను అందుకోవడానికి కమ్ముల ప్రయత్నిస్తున్నాడు.

మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagarjuna Sekhar Kammula Love Story Related Telugu News,Photos/Pics,Images..

footer-test