తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌ల జాత‌ర‌...స‌మ్మ‌ర్ అంతా డ‌బుల్ హీటే..!

2018 ముంద‌స్తు ఎన్నిక‌ల ప‌ర్వం నుంచి తెలంగాణ‌లో వ‌రుస‌గా ఏదో ఒక ఎన్నిక జ‌రుగుతూనే ఉంది.ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌లు ఆ త‌ర్వాత స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, పంచాయితీలు, మండ‌లాలు, స‌హ‌కార సంఘాల ఎన్నిక‌లు, లోక్‌స‌భ ఎన్నిక‌లు, హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌.

 Again Elections In Telangana..double Heat In Summer, Elections, Telangana, Doubl-TeluguStop.com

ఇక తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌లు ఇలా ఏదో ఒక ఎన్నిక న‌డుస్తూనే ఉంటోంది.ఇక త్వ‌ర‌లోనే నాగార్జునా సాగ‌ర్ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.
నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌పై ఇప్ప‌టికే తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి ఉండ‌గా.ఇప్పుడు ఈ స‌మ్మ‌ర్ అంతా వ‌రుస ఎన్నిక‌ల‌తో తెలంగాణ పాలిటిక్స్‌ను మ‌రింత హీటెక్కించ‌నుంది.

ఏప్రిల్లో తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగ‌నుంది.త్వ‌ర‌లోనే ఏడు పుర‌పాల‌క సంఘాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

గ్రేటర్ వరంగల్.ఖమ్మం.

నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీల గడువు మార్చి 14తో ముగుస్తుంది.ఇక సిద్ధిపేట కార్పొరేష‌న్ గ‌డువు ఏప్రిల్ 15 వ‌ర‌కు ఉంది.

Telugu Double, Greater, Khammam, Nagar Kurnool, Telangana, Warangal-Telugu Polit

న‌గ‌ర పంచాయితీల నుంచి మున్సిపాల్టీలుగా మారిన న‌కిరేక‌ల్‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరుకు ఎన్నిక‌లు పెట్ట‌లేదు.ఇప్పుడు ఈ ఏడు న‌గ‌ర పాలిక సంస్థ‌ల‌కు క‌లిపి స‌మ్మ‌ర్‌లో ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తార‌ని తెలుస్తోంది. తెలంగాణ కొత్త మునిసిప‌ల్ ఎన్నిక‌ల చ‌ట్టం ప్ర‌కారం ప్ర‌స్తుత పాల‌క వ‌ర్గం గ‌డువు ముగియ‌డానికి మూడు నెల‌ల ముందు నుంచే త‌దుప‌రి ఎన్నిక‌ల స‌న్నాహాలు చేయాలి.

ఇక నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌, ఏడు న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌కు ఎన్నిక‌ల‌తో పాటు రెండు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌కు జ‌రిగే ఎన్నిక‌ల‌తో ఈ స‌మ్మ‌ర్ అంతా రాజ‌కీయంగా మ‌ళ్లీ హీటెక్క‌నుంది.

దుబ్బాక ఉప ఎన్నిక త‌ర్వాత మామూలుగానే హీటెక్కిన తెలంగాణ రాజ‌కీయ సెగ‌లు ఇప్పుడు మ‌రింత హీటెక్క‌డం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube