స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న నాగ్.. ఎందుకంటే ?

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.ఈ మధ్యే ఆయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అందుకుంది.

 Nagarjuna Praveen Sattaru Movie Latest Update, Nagarjuna, Praveen Sattaru, Kajal-TeluguStop.com

చాలా రోజుల తర్వాత హిట్ అందుకోవడంతో అదే జోష్ లో వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న ప్రకటించాడు.

ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా మొదలు పెట్టగానే లాక్ డౌన్ అవ్వడంతో వాయిదా పడింది.ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.కాబట్టి ఈ సినిమాను జూన్ మొదటి వారంలోనే స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నారు.

త్వరలోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది.

Telugu Bangarraju, Kajal Aggarwal, Kalyan Krishna, Nagarjuna, Praveen Sattaru-Mo

ప్రవీణ్ సత్తారు ఈ సినిమాలో నాగార్జున పాత్రను చాలా స్టైలిష్ గా డిజైన్ చేసాడట.ఈసారి షెడ్యూల్ లో హై వోల్టాజ్ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించాం బోతున్నాడని సమాచారం.ఇందులో నాగార్జున ఎక్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడని తెలుస్తుంది.

ఈ పాత్ర కోసం నాగార్జున చాలా మేకోవర్ అవుతున్నాడట.అంతేకాదు ఈ సినిమా కోసం నాగ్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది.

Telugu Bangarraju, Kajal Aggarwal, Kalyan Krishna, Nagarjuna, Praveen Sattaru-Mo

ఇజ్రాయిల్ సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు క్రావ్ మాగా, కత్తిసాము వంటి వాటిల్లో కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మొదటిసారిగా కాజల్ అగర్వాల్ నాగార్జునకు జోడీగా నటిస్తుంది.నారాయదాస్, రామ్మోహన్ రావు,శరత్ మరార్ లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో పాటు నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా కూడా చేస్తున్నాడు.

ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube